జగన్, కేటీఆర్, ఎన్టీఆర్, రామ్‌ చరణ్... నారా లోకేశ్‌కు షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాత

చంద్రబాబు నాయుడు కుమారుడుగా తప్ప రాజకీయంగా మీకు ఏ అర్హత లేదని... నాకు తెలిసి మీరు రాజకీయంగా ఫెయిల్యూర్ నాయకుడని లోకేశ్‌పై బండ్ల గణేశ్ కామెంట్ చేశారు.

news18-telugu
Updated: May 5, 2020, 4:53 PM IST
జగన్, కేటీఆర్, ఎన్టీఆర్, రామ్‌ చరణ్... నారా లోకేశ్‌కు షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాత
బండ్ల గణేశ్, నారా లోకేశ్(ఫైల్ ఫోటో)
  • Share this:
నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేశ్ ఎవరూ ఊహించని విధంగా టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్‌పై ట్విట్టర్‌లో కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారాయి.మొన్నటికి మొన్న తెలంగాణ రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలంటూ ఏపీ పొలిటికల్ లీడర్లకు క్లాస్ పీకిన బండ్ల.. తాజాగా నారా లోకేష్‌ను టార్గెట్‌ను చేశారు. నారా లోకేష్ గారికి ప్రేమతో అంటూ మొదలుపెట్టిన ఆయన... ఈ ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అదృష్టం మీకు దక్కడం నిజంగా మీ అదృష్టమని అన్నారు. రాజకీయ పార్టీ అంటే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదని... మన దగ్గర మన పార్టీలో నాయకులు అందరూ మన దగ్గర ఎంప్లాయిస్ కాదని వ్యాఖ్యానించారు. మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మీ తండ్రి మీ గురించి గర్వంగా నిద్రపోయే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బండ్ల గణేశ్ కామెంట్ చేశారు.

ఈ మధ్య ట్విట్టర్‌లో మీరు చేస్తున్న కామెంట్లు మిమ్మల్ని ఇష్టపడే చాలామంది బాధపడుతున్నారని... మీరు అద్భుతంగా పనిచేసి ప్రజలలో నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా మీ రాజకీయ ఉండాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సమకాలికుడుగా పనిచేసిన ఆయన మంత్రివర్గంలో పనిచేసిన కెసిఆర్ గారి కుమారుడు కేటీఆర్ లాగా మీరు ఉండాలని బండ్ల గణేశ్ అన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్థులు అందరూ ఒక్కటై అణచివేయాలని చూసిన అందర్నీ ఎదిరించి తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రాంచరణ్ లాగా తండ్రికి పోటీ ఇచ్చే విధంగా మీరు కూడా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తే మీరు చేసిన ట్వీట్ మీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, చంద్రబాబు, ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవమని అన్నారు. ఎవరు ఏ విధమైన సపోర్ట్ చేయకపోయినా నంబర్ వన్ పొజిషన్‌కి వచ్చినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా మీరు వుండాలని నారా లోకేశ్‌కు సూచించారు. చంద్రబాబు నాయుడు కుమారుడుగా తప్ప రాజకీయంగా మీకు ఏ అర్హత లేదని... నాకు తెలిసి మీరు రాజకీయంగా ఫెయిల్యూర్ నాయకుడని లోకేశ్‌పై బండ్ల గణేశ్ కామెంట్ చేశారు.
First published: May 5, 2020, 4:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading