నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి. ఈ సందర్భంగా... ఇవాళ ఏపీ వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి. వాటిలో ప్రధానంగా తన తండ్రికి నివాళులు అర్పించడానికి సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు వెళ్లారు. ఇవాళ ఉదయం 8.10 గంటలకు తన కుటుంబసభ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వైఎస్సార్ ఘాట్ దగ్గర సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పిస్తారు. కరోనా వైరస్ దృష్ట్యా ఈ కార్యక్రమం మరీ అట్టహాసంగా కాకుండా సాదాసీదాగా నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీఎం జగన్ కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేటి ప్రభుత్వ కార్యక్రమాలు :
- పేద విద్యార్థులకు టెక్నాలజీ విద్యను అందించేందుకు ఇడుపులపాయ RK వ్యాలీ ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్లతో నిర్మించిన ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ తరగతి భవనాల ప్రారంభం.
- ఇడుపులపాయ నెమళ్ల పార్కు పక్కన 3 మెగావాట్ల సామర్ధ్యంతో రెస్కో కోలబ్రేషన్ సిస్టమ్తో సోలార్ విద్యుత్ ప్లాంటు నిర్మించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరణ.
- ఇడుపులపాయ RK వ్యాలీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన YSR విగ్రహ ఆవిష్కరణ.
- ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రూ.10.10 కోట్లతో ఏర్పాటు చేసే కంప్యూటర్ సెంటర్కు శంకుస్థాపన
- క్యాంపస్లో రూ.40 కోట్లతో నిర్మిస్తున్న YSR ఆడిటోరియంకు శంకుస్థాపన
- వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్ఆర్ పుస్తక ఆవిష్కరణ
- వైఎస్సార్ జయంతి సందర్భంగా... గుంటూరు తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో ఉదయం 9.15 గంటలకు నివాళులు అర్పిస్తారు.