తిరుమలలో నేడు వృద్ధులు, దివ్యాంగులకు దర్శనభాగ్యం

తిరుమలలో నేడు వృద్ధులు, దివ్యాంగులకు దర్శనభాగ్యం

తిరుమలలో నేడు వృద్ధులు, దివ్యాంగులకు దర్శనభాగ్యం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎప్పటికప్పుడు భక్తుల దర్శన విషయంలో మార్పులూ, చేర్పులూ చేస్తోంది.

  • Share this:
    తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముసలివారు, దివ్యాంగులు, పిల్లలకు శ్రీవారిని దర్శించుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ... టీటీడీ పాలక మండలి కొత్త నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇవాళ ముసలివాళ్లు (65 ఏళ్లు దాటినవాళ్లు), దివ్యాంగులకు 4వేల దర్శన టోకెన్లు ఇస్తోంది. ఉదయం 10 గంటలకు వెయ్యి మంది, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల మంది, 3 గంటలకు మరో వెయ్యి మంది స్వామిని దర్శించుకునే అవకాశం ఇస్తున్నారు. అలాగే బుధవారం (డిసెంబర్ 18న) ఐదు సంవత్సరాలలోపు చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులను ఉదయం 9 గంటల నుంచీ మధ్యాహ్నం 1.30వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. మామూలుగా ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు మాత్రమే సుపథం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. బుధవారం ఐదేళ్ల వరకూ అనుమతించడం గొప్ప విషయమే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.
    Published by:Krishna Kumar N
    First published: