నేడు జనసేన ఆవిర్భావ దినం... పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం...

Janasena 6th Formation Day | Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి నేటికి (మార్చి 14) ఆరు సంవత్సరాలు పూర్తవనుంది. మరి ఇవాళ పవన్ ఏం చేస్తారు?

news18-telugu
Updated: March 14, 2020, 5:54 AM IST
నేడు జనసేన ఆవిర్భావ దినం... పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం...
నేడు జనసేన ఆవిర్భావ దినం... పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం... (credit - twitter - rusthum)
  • Share this:
Janasena 6th Formation Day | Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి నేటికి (మార్చి 14) ఆరు సంవత్సరాలు అవుతుంది. ఆరో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఐతే... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమాల్ని సాదాసీదాగా నిర్వహించనున్నారు. ఇవాళ ఏం చేసినా, ప్రతీ లెక్కా ఈసీకి నివేదించాల్సిందే. అందువల్ల వేడుకల్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి వేడుకలకు రాజమహేంద్రవరం (రాజమండ్రి) వేదిక కానుంది. నేటి ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్... పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరంలోని శ్రీరామపాదాల రేవులో గోదావరి నదికి హారతి ఇచ్చి ‘మన నుడి - మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అలాగే 15న రాజమహేంద్రవరంలోనే మేధావులతో, సామాజిక వేత్తలతో రాష్ట్ర పరిస్థితులపై పవన్ కళ్యాణ్ చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలని, వీలును బట్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకావాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి.హరిప్రసాద్ కోరారు.

 


నిజానికి వైసీపీపై పోరాటానికి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆరంభంగా చేసుకోవాలని జనసేన భావించింది. ఐతే... 144 సెక్షన్ అమల్లో ఉండటం వల్ల... బహిరంగ సభలు చేపట్టేందుకు చాలా షరతులు తప్పవు. ఏదైనా సభ నిర్వహించినా... దానికి అయ్యే ఖర్చులు... అభ్యర్థుల ఖర్చుల లిస్టులో చేరతాయి. అందుకే జనసేన పార్టీ బహిరంగ సభ బదులు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.

 


2014 మార్చి 14న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్టీని లాంచ్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీతో కలసి జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి విజయం సాధించింది. అయితే, టీడీపీ, బీజేపీ పోటీ చేశాయి. జనసేన మాత్రం పోటీ చేయకుండా ఉండిపోయింది. అయితే, 2014 - 19 మధ్య రాజకీయాలు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీతో కలసి బరిలో దిగారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన తరఫున కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీకి పవన్ కళ్యాణ్ దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని తాజాగా విజన్ డాక్యుమెంట్‌ను కూడా రిలీజ్ చేశాయి.
First published: March 14, 2020, 5:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading