హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నామినేషన్లకు నేడే ఆఖరి రోజు... ఇప్పటివరకూ ఎన్ని వేశారు... ప్రత్యేకతలేంటి?

నామినేషన్లకు నేడే ఆఖరి రోజు... ఇప్పటివరకూ ఎన్ని వేశారు... ప్రత్యేకతలేంటి?

నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్

నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్

Elections Nominations : నేటి మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ పూర్తవుతుంది. 26న నామినేషన్లను పరీశీలిస్తారు. 28 వరకూ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

చూస్తూ ఉండగానే... ఎన్నికలు వచ్చేస్తున్నాయి... మరికొన్ని గంటల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసిపోబోతోంది. ఇక ఆ తర్వాత టికెట్ల కోసం నేతలు పార్టీలు జంప్ చేసే పరిస్థితి ఉండదు. టికెట్ కోసం ఎదురు చూసే అవసరమూ ఉండదు. ఆ చాప్టర్ క్లోజ్ అయినట్లే. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇప్పటివరకూ 220 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ లాస్ట్ డే కాబట్టి పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసే ఛాన్సుంది. టీఆర్‌ఎస్‌ నుంచీ... నల్గొండ, ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు ఇంకా వెయ్యలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థులు సైతం ఖమ్మం, హైదరాబాద్‌ స్థానాలకు నామినేషన్లు పెండింగ్ పెట్టుకున్నారు. అదంతా అధికారులకు అనవసరం కాబట్టి... వాళ్లు తమ షెడ్యూల్ ప్రకారం... 26న నామినేషన్లను చెక్ చేస్తారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈలోగా అభ్యర్థులెవరైనా తమ నామినేషన్ వెనక్కి తీసుకోవాలనుకుంటే 28 లోపు తీసేసుకోవచ్చు. సో... 28 సాయంత్రం అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. దాన్ని చూసుకుంటే చాలు... ఏ నియోజక వర్గం నుంచీ ఏయే పార్టీల తరపున ఎవరెవరు పోటీ చేయబోతున్నారో మనకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఏప్రిల్‌ 11న తెలంగాణ, ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.


ఈసారి నిజామాబాద్ లోక్ సభ స్థానానికి ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ జరిగేలా ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పటివరకూ 57 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ మరో 100 దాకా దాఖలయ్యే ఛాన్సుంది. అభ్యర్థుల సంఖ్య 96 దాటితే... పేపర్ బ్యాలెట్ తప్పదు. అందువల్ల అక్కడ పేపర్ బ్యాలెట్ జరపాల్సి వస్తుందేమోనని అధికారులు ఆలోచనలో పడ్డారు. దానికి సమాధానం ఇవాళ రైతులు వేసే నామినేషన్ల సంఖ్యను బట్టీ ఉంటుంది.


తెలంగాణ సీఈఓ రజత్‌ కుమార్‌ ఇవాళ అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 15 వరకూ తీసుకున్న 3.38 లక్షల కొత్త ఓటర్ దరఖాస్తులను పరిశీలించారు. అవన్నీ కలిపి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అది ప్రకటించాక, ఓటర్ల జాబితాలో మన పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట.


ఆంధ్రప్రదేశ్‌లో కూడా నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈనెల 18న మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. నామినేషన్‌ పత్రాలతో పాటూ ఐదేళ్ల ఇన్‌కంట్యాక్స్‌ రిటర్న్స్‌, అభ్యర్థుల నేరచరిత్రను కూడా పొందుపర్చాలని ఎన్నికల కమిషన్‌ కొత్తగా నిబంధన పెట్టింది. దీంతో అభ్యర్థులు 6 నుంచి 46 పేజీల అఫిడవిట్లు దాఖలు చేశారు. అవన్నీ పరిశీలించడం అధికారులకు భారమే. అయినా తప్పదు. 26న పరిశీలించి... 28న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. సాయంత్రం నుంచీ అన్ని పార్టీల దృష్టీ గురువారంపై ఉంటుందన్నమాట.


 


ఇవి కూడా చదవండి :


కన్నా, రాయపాటి, శ్రీకృష్ణ... గుంటూరు... నరసారావుపేట ఎంపీ స్థానంలో గెలిచేదెవరు?


PUBG : ఇండియాలో పబ్‌జీ ఎర్రర్ ఫిక్సైంది... ఇక ఎంతసేపైనా ఆడుకోవచ్చు...


ఎలక్ట్రిక్ కార్లకు వైర్ లెస్ ఛార్జింగ్... నార్వేలో విజయవంతమైన ప్రయోగాలు

First published:

ఉత్తమ కథలు