ఏపీ, తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

సికింద్రాబాద్‌లో భారీగా కురిసిన వర్షం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం అక్కడక్కడా భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం.

 • Share this:
  ఆదివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. అయితే సోమవారం కూడా ఏపీ తెలంగాణలో భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం అక్కడక్కడా భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తా కర్ణాటక వరకూ తెలంగాణ, మధ్య కర్ణాటకల మీదుగా 1.5 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందన్నారు.

  మధ్య ఒడిశా ప్రాంతాల్లో 1.5 కి.మీ.ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్లు చెప్పారు. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.ఓ వైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు వానతో దసరా పండగకు ఊళ్లకు వెళ్లే వారు నానా ఇబ్బందులు పడ్డారు.

  ఇవికూడా చూడండి:
  తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సుల్లో నిలువు దోపిడీ

  Published by:Sulthana Begum Shaik
  First published: