ఏపీ, తెలంగాణలో ఇవాళ అతి భారీ వర్షాలు

ఈ నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు.

news18-telugu
Updated: September 25, 2019, 10:09 AM IST
ఏపీ, తెలంగాణలో ఇవాళ అతి భారీ వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా వానలు పడతూనే ఉన్నాయి. ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇవాళ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీలో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్,అసోం,  మధ్య మహారాష్ట్ర, గోవా, కొంకణ్, తూర్పు ఉత్తరప్రదేశ్, మరఠ్వాడ, జార్ఖండ్, బీహార్, మేఘాలయ, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.

జార్ఖండ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమిళనాడు, మాల్దీవులు, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని... మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నారు. హైదరబాద్‌లో నిన్నరాత్రి కుండపోతగా కురిసన వానకు జనజీవనం అస్తవ్యస్తమయ్యింది.
Published by: Sulthana Begum Shaik
First published: September 25, 2019, 10:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading