Andhra Pradesh: నేడు ఏపీ బంద్.. స్కూళ్లు సహా అన్నీ క్లోజ్.. విశాఖకు చంద్రబాబు

Andhra Pradesh: నేడు ఏపీ బంద్.. స్కూళ్లు సహా అన్నీ క్లోజ్.. విశాఖకు చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్ (ఫైల్)

బంద్ నేపథ్యంలో నేడు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఆర్టీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితం అయ్యాయి.

  • Share this:
    ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం ఊపందుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ క్రమంలో నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది. ఏపీ బంద్‌కు బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. పెద్ద ఎత్తున బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ప్రభుత్వం కూడా మద్దతు తెలపడంతో.. నేడు ఏపీ మొత్తం హీటెక్కనుంది. ఉక్కు పిడికిలి బిగించి.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గర్జించనుంది.


    బంద్ నేపథ్యంలో నేడు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. షాపులు, ప్రైవేట్ కార్యాలయాలు కూడా మూతపడ్డాి. ఇక ఆర్టీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. ఐతే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే బస్సులు నడుపుతామని మంత్రి పేర్నినాని తెలిపారు. ప్రభుత్వం బంద్‌కు మద్దతు ఇస్తోందని.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా బంద్‌లో పాల్గొంటారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా విశాఖలో ఉన్నారు. వారంతా ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొంటారు. ఇక టీడీపీ నేత చంద్రబాబునాయుడు బంద్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లనున్నారు.

    విశాఖ ఉక్కుని బయటపడేయాలని కేంద్రం భావిస్తే సొంత గనులు కేటాయిస్తే సరిపోతుందని అన్నారు కార్మిక సంఘాలు అంటున్నాయి. 2020లో విశాఖ పరిశ్రమలో పేరుకుపోయిన లక్ష టన్నుల ఐరన్ నిల్వల విలువే 7వేల కోట్లు ఉంటుందని, అలాంటిది 1 లక్ష 50వేల కోట్లు విలువచేసే 30వేల ఎకరాలు భూములు, లక్ష టన్నుల నిల్వలు, లక్ష కోట్ల విలువచేసే యంత్ర పరికరాలు, ఐరన్ వోర్ నిల్వలు మొత్తం కలిపి 6వేల కోట్లకు అమ్మాలని నిర్ణయించడం దారుణమైందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

    పలు కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేటీకరించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా విక్రయించడానికి జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఉన్నతాధికారులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ (దీపం) విభాగానికి సిఫార్సు చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఇది వెలుగులోకి రావడంతో.. ఏపీలో వేలాది కార్మికులు ఆందోళనలను ప్రారంభించారు. అన్ని పార్టీలు కేంద్రంపై మండిపడుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాసినా.. ఎంపీలు, వివిధ పార్టీల ప్రముఖులు కేంద్రానికి విన్నవించినా.. ఎవరూ స్పందించలేదు. రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే నేడు ఏపీ బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు