Dussehra: నేటినుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. తొలి రోజు శ్రీస్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో దర్శనం.. ప్రత్యేకత ఏంటంటే..?

దసరా ఉత్సవాలు

Dussehra celebrations on Vijayawada: బెజవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు భక్తులకు అమ్మవారు శ్రీస్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు.

  • Share this:
    Dussehra celebrations on Vijayawada: అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి ఘనంగా ప్రారంభమయ్యాయి.  నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అతి ముఖ్యమైనదిగా భావించే మూలా నక్షత్రమైన ఈ నెల 12న కనకదుర్గ (Kanaka durga) అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) పట్టు వ్రస్తాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు. దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందురోజున వన్‌టౌన్‌ పోలీసులు అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఆనవాయితీ అనవాయితీగా మారింది.. తర్వాత రోజుల్లో నగర పోలీసు కమిషనర్‌ (Police Commissioner) సమర్పించేవారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు (Batthina Srinivasulu) కుటుంబసమేతంగా బుధవారం రాత్రి ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు వేద పండితులు, అర్చకులు సుప్రభాతసే వతో అమ్మవారిని మేల్కొలిపి, శాస్త్రోక్తంగా స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనలు చేశారు..

    ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత రోజు నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తారు. అమ్మవారి దర్శనానికి రోజుకు 10 వేల మందిని మాత్రమే అనుమతిస్తారు. 4 వేల మందికి ఉచితంగా, 3 వేల మంది వంతున 100 రూపాయలు, 300 రూపాయల టికెట్లతో దర్శనం కల్పించనున్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ లేకుండా వచ్చిన భక్తులకు అప్పటికప్పుడు దర్శనం టికెట్లు విక్రయించేందుకు వీఎంసీ కార్యాలయం ఎదుట, పున్నమి ఘాట్‌ వద్ద దుర్గగుడి టోల్‌ గేట్, ఓం టర్నింగ్‌ల వద్ద కరెంటు బుకింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా అంతరాలయ దర్శనాలను రద్దుచేసి లఘు దర్శనం ఏర్పాటు చేశారు.

    కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నదానాన్ని నిలుపుదల చేశారు. దానికి బదులుగా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు బెల్లం పొంగలి, 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాంబార్‌ రైస్, పెరుగు అన్నం ప్యాకెట్లు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బెల్లం పొంగలి భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం ఇంద్రకీలాద్రిపై శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. గవర్నర్‌ రానున్నందున ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

    శ్రీస్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి
    దేవీశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలిరోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారిని స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శించుకోవడంతో సకల దారిద్యాలు తొలిగిపోయి సుఖసంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం.
    Published by:Nagesh Paina
    First published: