హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: రెండు రోజుల పాటు సీఎం జగన్ బిజీ బిజీ.. నేడు గవర్నర్ తో భేటీ.. రేపు విశాఖ జిల్లాల్లో పర్యటన

CM Jagan: రెండు రోజుల పాటు సీఎం జగన్ బిజీ బిజీ.. నేడు గవర్నర్ తో భేటీ.. రేపు విశాఖ జిల్లాల్లో పర్యటన

నేడు గవర్నర్ ను కలనున్న సీఎం జగన్ (ఫైల్)

నేడు గవర్నర్ ను కలనున్న సీఎం జగన్ (ఫైల్)

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి బిజీ బిజీ కానున్నారు. వరుసగా రెండు రోజులు రెండు కార్యక్రమాలతో బిజీ అవుతున్నారు. నేడు ప్రకాశం జిల్లాలో.. రేపు విశాఖ జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. ఆయన పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే..

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) రెండు రోజుల పాటు బిజి బిజీ కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.55 గంటలకు ప్రకాశం జిల్లా (Prakasam District) టంగుటూరు మండలం కారుమంచి చేరుకుంటారు. 11.15 నుంచి 11.45 కొండెపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ వరికూటి అశోక్‌బాబు (Varikuti Asokhbabu ) నివాసంలో ఆయన తల్లి కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పిస్తారు. తరువాత 12.10 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ శ్రీ అబ్దుల్‌ నజీర్‌ (Governor Abudul Nazeer)ను ప్రత్యేకంగా జగన్ కలుస్తారు. అయితే గవర్నర్ ను కలవడానికి ప్రత్యేక కారణమే ఉండొచ్చు అంటున్నారు. తాజాగా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన చర్చించొచ్చని తెలుస్తోంది.

ఇక రేపు సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నంలో పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌ చేరుకుని 7 నుంచి 8.00 గంటల మధ్య జీ 20 డెలిగేట్స్‌తో ఇంటరాక్షన్‌ కార్యక్రమం ఉంటుంది అంటున్నారు. తరువాత అతిధులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిన్నర్‌లో పాల్గొని రాత్రి 8.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

విశాఖలో వేదికగా ఈ నెల 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. దీనిలో 45 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. జీ-20 దేశాల ప్రతినిధులు చాలా నగరాల్లో ఈ మీటింగ్స్ జరుపుతున్నారు. అందులో భాగంగా విశాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ సదస్సు జరపనుంది. వైజాగ్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో రెండు రోజుల పాటు ఈ కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు. దీనికోసం జీవీఎంసీ ( గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు .

ఇదీ చదవండి : ఉండవల్లి కాదు ఊసరవెల్లి.. రిటర్న్ గిఫ్ట్ కు కౌంటర్ గా మంత్రి సంచలన వ్యాఖ్యలు

జీ -20 సదస్సును బేస్ చేసుకుని వైజాగ్ బ్రాండింగ్ కోసం కష్టపడుతోంది జీవీఎంసీ. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు వైజాగ్ వాసులను కూడా జీ-20 సదస్సులో పార్ట్నర్లను చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే బోట్ రేసింగ్, కైట్ ఫెస్టివల్ లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పటికే నిర్వహించింది. వీటితో పాటు ఈ వీకెండ్ లో కార్నివాల్ , మారథాన్ లను కూడా జరపనున్నారు. వ్యర్ధ పదార్థాలతో కళాఖండాల ఫెస్టివల్ ను కూడా నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొనేలా వైజాగ్ వాసులను ఎంకరేజ్ చేస్తుంది జీవీఎంసీ . దీనిని "జన్ భాగిదారీ " ప్రోగ్రామ్ గా పిలుస్తున్నారు.

ఇదీ చదవండి : ఎమ్మెల్సీ ఓటు కోసం టీడీపీ 10 కోట్లు ఆఫర్ చేసిందా..? రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

100 కోట్లతో వైజాగ్ సుందరీకరణ

జీ - 20 సదస్సు నేపథ్యంలో విశాఖ సుందరీకరణ కు 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం . ఆర్కే బీచ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్ వరకూ ఉన్నమార్గాన్ని అత్యంత అందంగా తయారుచేశారు. అలాగే అతిధులు చేరుకునే ఎయిర్పోర్ట్ నుండి వైజాగ్ సిటీ వరకూ ఉన్న హైవే ను సరిక్రొత్తగా మార్చేసారు . ఎటుచూసినా అతిధులకు ,ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ .. రంగురంగుల లైట్లతో వైజాగ్ ను మరింత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Visakhapatnam

ఉత్తమ కథలు