TIRUPATI ZPHS SCOLL STUDENT TURRNED TO LABORS BY THE SCHOOL HEAD MASTER THEN PARENTS FIRE ON HEAD MASTER NGS TPT
Head Master: విద్యార్థులను కూలీలుగా మార్చిన హెడ్ మాస్టర్.. తల్లితండ్రులకు తెలిసి ఏంచేశారంటే..?
విద్యార్థులను కూలీలుగా మార్చిన హెడ్ మాస్టర్
Head Master: భావి భవిష్యత్తుపై బంగారు ఆశలతో వారంతా విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు.. వారిని బాల కార్మికులుగా మార్చకూడదని తల్లిదండ్రులకు చెప్పాల్సిన హెడ్ మాస్టర్.. భిన్నంగా ప్రవర్తించారు. ఆయనే ఆ విద్యార్థులను రోజు కూలీలుగా మార్చారు.. ఎందుకో తెలుసా..?
Head Master: నీరు పేద కుటుంబంలో జన్మించిన పిల్లలు బాలకార్మికులుగా మారకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) నాడు - నేడు (Nadu Nedu) కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా స్కూల్ భవనానికి కొత్త హంగులు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంను జోడించి పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం (English Medium)ను అమలు చేసింది. తమ పేదరికాన్ని రూపు మేపేందుకు ఎన్నో ఆశలతో విద్యార్థులు స్కూళ్లకు వస్తుంటారు. బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. మాస్టర్ (Master) చెప్పే పాటలను బుద్ధిగా చదువుకొని ఉతీర్ణులు అవుతున్నారు. ఓ పాఠశాల (School)లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు (Students).. ఓ వైపు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు పరీక్షలలో ఉతీర్ణత సాధించేలా స్కూళ్లలో స్టడీ హౌస్ నిర్వహించాల్సిన ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థులను దినసరి కూలీలుగా మార్చారు.
వివరాలోకి వెళితే.. అన్నమయ్య జిల్లా కెవి పల్లి మండలంలోని మారెళ్ల గ్రామంలోని మారెళ్ల ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా గంగాధరం విధులు నిర్వహిస్తున్నారు. అదే గ్రామంలో డ్వాక్రా మహిళల కోసం వసతి గది నిర్మిస్తున్నారు. రాళ్ళూ, సిమెంట్ మూటలు మోయాలంటే అందుకు కూలీలు కావాలి. విధ్యార్థులనే కూలీలుగా మార్చాడు హెడ్ మాస్టర్ గంగాధరం. పునాదుల కోసం వేసే రాళ్లను విద్యార్థులతో మోయించే ప్లాన్ వేసాడు. స్కూల్ కి వచ్చిన విద్యార్థులను ఆటోలో సీమెంటు బస్తాలు, రాళ్ళూ మోసేందుకు పంపారు. ఆలా రాల్లు మోస్తున్న కొందరు విద్యార్థులను చూసి సెల్ ఫోన్ లో వీడియోలు తీశారు స్థానికులు.
అయితే ఓ విద్యార్థి జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పడంతో ఆ నోటా...ఈ నోటా పాకీ విద్యార్థుల తల్లితండ్రులు స్కూల్ కి తాళం వేసేందుకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడితో గొడవకు దిగారు. ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యార్థులను కూలీలుగా మార్చడం ఏంటని ప్రశ్నించారు. ఎస్ ఏ-2 పరీక్షలు జరపకుండా పనులు చేస్తున్న ఎంఈఓ పట్టించుకోలేదని పిల్లల తల్లిదండ్రులు.. వెంకటసుబ్బయ్యను ప్రశ్నించగా తల్లిదండ్రులకు సరైన జవాబు చెప్పకపోవడంతో అక్కడ ఉన్నవారంతా? స్కూల్ కి తాళాలు వేశారు.
అయితే పోలీసులే కలగజేసుకుని పిల్లల తల్లిదండ్రులుతో మాట్లాడి పరీక్షలు జరిగే వేళ ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పి హెడ్ మాస్టర్, ఇన్చార్జ్ హెడ్ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్కూల్ తాళాలు తెరిపించారు. పిల్లల తల్లిదండ్రులు మాత్రం స్కూల్ బయట బైఠాయించారు. మా పిల్లల చేత ఇలాంటి పనులు చేయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తాము చదువుకోడానికి పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నామని... కానీ వారి చేత పని చేయించుకోవడానికి కాదు అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.