Home /News /andhra-pradesh /

Andhra Pradesh: పాముల‌కు ఆహారం వేయ‌డానికి వెళ్లి వాటి కాటుకు గురై మ‌ర‌ణించింది!

Andhra Pradesh: పాముల‌కు ఆహారం వేయ‌డానికి వెళ్లి వాటి కాటుకు గురై మ‌ర‌ణించింది!

తిరుప‌తి జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. దాదాపు 10 ఏళ్లుగా జూ పార్క్ లో జంతుసంర‌క్ష‌కురాలిగ ప‌ని చేస్తోన్న విజ‌య‌మ్మ జూ పార్క్ లో పాముల‌కు ఆహారం వేస్తోన్న క్ర‌మంలో పాము కాటుకు గురై మూడు రోజుల చికిత్స త‌రువాత మ‌ర‌ణించింది. ఈ సంఘ‌ట‌న పై జూ పార్క్ అధికారులు సంతాపం వ్య‌క్తం చేశారు.

ఇంకా చదవండి ...
    జూ పార్క్ లో జంతు సంర‌క్ష‌కుల ఉద్యోగం నిత్యం క‌త్తి మీద సాములా ఉంటుంది. రెప్ప‌పాటు నిర్ల‌క్ష్యం కూడా ఒక్కొసారి ప్రాణాల మీదాకి తీసుకొస్తుంది కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే చాలా జ‌రిగాయి కూడా. ఏ జంతువుల‌నైతే అల్లారు ముద్దుగా పెంచుతారో అవి జంతువుల వాళ్ల ప్రాణాలు కోల్పొవాల్సి వ‌స్తుందు కూడా. ఇలాంటి సంఘ‌ట‌నే తిరుప‌తి జూ పార్క్ లో చోటు చేసుకుంది. జూ పార్క్ లో ఉన్న పాముల సంర‌క్ష‌కురాలు పాముల‌కు ఆహారం వేసే క్ర‌మంలో పాము కాటుకు గురై ప్రాణాలు విడిచింది. విజ‌య‌మ్మ (55) తిరుప‌తి ఎస్వీ జూ పార్క్ లో జంతుసంర‌క్ష‌కురాలిగా విధులు నిర్వ‌హిస్తుండేది. విధుల్లో భాగంగా సోమ‌వారం జూ పార్క్ లో ఉన్న పాములు, ప‌క్షుల‌కు ఆహారం వేస్తోన్న స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తు పాము కాటు వేసింది.

    జూ పార్క్ సిబ్బంది హూటాహూటిన ఆసుప‌త్రికి తీసుకెళ్లారు అయితే మూడు రోజుల చికిత్స త‌రువాత గురువారం రాత్రి క‌న్ను మూసింది విజ‌య‌మ్మ‌. దాదాపు 10 ఏళ్లుగా జూ పార్క్ లో జంతు సంరక్ష‌కులుగా విధులు నిర్వ‌హిస్తోన్న విజ‌య‌మ్మ ఇలా మ‌ర‌ణించ‌డం ప‌ట్ల జూ సిబ్బంది సంతాపం వ్య‌క్తం చేశారు. అధికార‌లు కూడా ఈ సంఘ‌ట‌న పై ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. దీంతోపాటు జూ పార్క్ లో జంతువుల‌కు ఆహారం అందించేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని అయిన‌ప్ప‌టికి ఈ సంఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌నే దానిపై విచార‌ణ జ‌రుగుతుంద‌ని తెలిపారు జూ పార్క్ అధికారు. విజ‌య‌మ్మ ను జూ పార్క్ లో ఉన్న పాము కాటిసేంది లేదంటే బ‌య‌ట ఉన్న ఎదైన పాము కాటేసిందా అనే కోణంలో విచార‌ణ చేస్తోన్నారు. విజ‌య‌మ్మ కుటుంబానికి జూ పార్క్ త‌రుపుణ ఆర్ధిక స‌హాయం చేస్తామ‌ని తెలిపారు అధికారులు.

    పాము విషం నేరుగా విజ‌య‌మ్మ మెద‌కు చేరుకోవ‌డం వ‌ల‌న ఆమె మ‌ర‌ణించిద‌ని వైధ్యులు తెలిపారు. అయితే జూ పార్క్ లో ఇలాంటి జంతువుల నుంచి ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు త‌క్ష‌ణం చికిత్స అందించేందుకు అవ‌స‌ర‌మైన వైద్యా సదుపాయాలు పాముకాటుకు నుంచి కాపాడుకోవ‌డానికి గ‌ల మందులు ఎందుకు జూ పార్క్ లో లేవ‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తోన్నాయి. అయితే ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ప్ర‌థ‌మ చికిత్స చేసి అందుబాటులో ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించ‌మ‌ని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు.
    Published by:Balakrishna Medabayani
    First published:

    Tags: Andhra Pradesh, Snake bite

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు