MLA Roja Charity: బాలకృష్ణ బాటలో ఎమ్మెల్యే రోజా... కరోనా కట్టడికి భారీ సాయం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా (Corona Virus) సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిథులు ఆపన్నహస్తం అందిస్తున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తూనే.. శానిటైజేషన్ కార్యక్రమాలు చేపడుతోంది.కరోనా కేసులు అధికంగా ఉన్న చోట పారిశుద్ధ్య చర్యలను పటిష్టంగా చేపడుతోంది. ఓ వైపు ప్రభుత్వం మెరుగైన పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటుండగా.. ప్రజాప్రతినిథులు కూడా అదేస్థాయిలో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కరోనా కట్టడికి తమ వంతుసాయం చేయగా.. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా ఈ జాబితాలో చేరారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో కరోనా కట్టడికి రోజా సాయమందించారు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నియంత్రణ కోసం.. రూ.6లక్షలు విలువ చేసే వైద్య పరికరాలను రోజా ఛారిటబుల్ ట్రస్ట్ తరపున ఆమె భర్త ఆర్కే సెల్వమణి అధికారులకు అందజేశారు.

  నగరి నియోజకవర్గంలోని ప్రజలకు కరోనా కష్టకాలంలో అండగా ఉంటామని,కరోనా వైరస్ నియంత్రణకు తమ వంతు సాయం చేస్తామని సెల్వమణి తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. హెమటాలజీ అనలైజర్ మెషిన్, సెమి ఆటో అనలైజర్ మెషిన్, స్ప్రేయర్ పంప్ మిషిన్, సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావణం, పి పి కిట్స్, మాస్కులు, శానిటైజర్లు తదితర వైద్య, శానిటేషన్ పరికరాలును అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. రవిరాజు, డా.ప్రభావతి, డా.నవీన్, డా.అమరనాధ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ హరి, వైస్ చైర్మన్ శంకర్, కమీషనర్ వెంకట్రామిరెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్ సిపి నాయకులు, పాల్గొన్నారు.

  MLA Roja Help, MLA Roja Charity, ఎమ్మెల్యే రోజా సాయం, ఎమ్మెల్యే రోజా ధాతృత్వం, MLA Roja Zoom Meeting, MLA Roja Work From Home, MLA Roja on Corona, MLA Roja Assembly Constituency, ఎమ్మెల్యే రోజా జూమ్ మీటింగ్, ఎమ్మెల్యే రోజా వర్క్ ఫ్రమ్ హోమ్, ఎమ్మెల్యే రోజా సమీక్ష, ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ నియోజకవర్గం, Jabardasth, జబర్దస్త్, MLA Roja to get Minister Post, Minister RK Roja, Roja in AP Cabinet, రోజాకు మంత్రి పదవి, మంత్రి ఆర్కే రోజా, ఏపీ కేబినెట్లో రోజా, YS Jaganmoan reddy, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, MLA Roja Health Condition, MLA Roja, MLA RK Roja, Roja Selvamani, Roja, MLA Roja news, YV Subbareddy, Tirupati news, Chennai News, Andhra Pradesh, Andhra Pradesh News, AP News, Andhra News, Telugu news, ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఎమ్మెల్యే రోజా సెల్వమణి, ఎమ్మెల్యే రోజా వార్తలు, తిరుపతి వార్తలు, చెన్నై వార్తలు, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, ఆంధ్రా వార్తలు, jabardasth comedy show, jabardasth judge roja, jabardasth judge roja with daughter,jabardasth judge roja surgery,jabardasth judge roja hospital,jabardasth judge roja new photos,జబర్దస్త్ జడ్జి రోజా,రోజా కొత్త ఫోటోలు,సర్జరీ తర్వాత రోజా ఎలా ఉందంటే,కూతురు అన్షుతో రోజా ఫోటోలు, MLA Nandamuru Balakrishna Chairity, Balakrishna Help, Hindupuram, ఎమ్మెల్యే బాలకృష్ణ సాయం, నందమూరి బాలకృష్ణ, హిందూపురం
  వైద్య పరికరాలు అందజేస్తున్న ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి

  ఇది చదవండి: చట్టం ముందు ఎవరైనా ఒకటే..., కన్నకొడుకును కూడా వదలని సీఐ


  ఇదిలా ఉంటే ఇటీవలే అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలోని వారి కోసం కొవిడ్ నివారణ మందులను పంపించారు. దాదాపు 3వేల కరోనా మందుల కిట్లను బాలయ్య హిందూపురం పంపారు. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకునేవారికి మందులు అందించనున్నారు. గత ఏడాది దాదాపు 80 లక్షలు విలువ చేసే మందులు, వైద్య పరికరాలను ఎన్.బీ.కే సేవా సమితి ద్వారా హిందూపురం పంపించారు బాలయ్య.

  ఇది చదవండి: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ముగిసేది అప్పుడే.. తేల్చిచెప్పిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్..


  ఇక రోజా విషయానికి వస్తే... ఇటీవల సర్జరీ చేయించుకొన్న ఆమె.. చెన్నైలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంట్లో ఉంటూనే ఇటీవల కరోనా నియంత్రణ చర్యలపై జూమ్ మీటింగ్ ద్వారా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై దిశానిర్దేశం చేశారు. తాను నేరుగా రంగంలోకి దిగకపోయినా తన భర్తతో కరోనా వైద్య, శానిటైజేషన్ పరికరాలను నియోజకవర్గ ప్రజల కోసం పంపారు రోజా. తమ ఎమ్మెల్యే చేసిన సాయానికి నగరి ప్రజలు రోజాకు కృతక్షతలు చెప్తున్నారు.

  ఇది చదవండి: కరోనా వల్ల తిరుమలకు రాలేకపోతున్నారా..? భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ...

  Published by:Purna Chandra
  First published: