TIRUPATI YSRCP MLA ROJA SLAMS TDP CHIEF NARA CHANDRABABU NAIDU KUPPAM TOUR AND CHALLENGE BABU TO RESIGN AND CONTEST FULL DETAILS HERE PRN TPT
MLA Roja: చంద్రబాబుపై రోజా సెటైర్లు.. కుప్పంలో రాజీనామా చేసి గెలవాలని సవాల్
ఎమ్మెల్యే రోజా (ఫైల్)
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandra Babu Naidu) పై వైసీపీ (YCP) నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారు. బాబు కుప్పం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత టార్గెట్ గా విమర్శలు, సవాళ్లు విసురుతున్నారు. శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Rama Chandra Reddy).. కుప్పంలో బాబును ఓడిస్తామని సవాల్ చేస్తే.. తాజాగా ఎమ్మెల్యే రోజా (MLA Roja) చంద్రబాబు కుప్పం టూర్ పై సెటైర్లు వేశారు.
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandra Babu Naidu) పై వైసీపీ (YCP) నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారు. బాబు కుప్పం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత టార్గెట్ గా విమర్శలు, సవాళ్లు విసురుతున్నారు. శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Rama Chandra Reddy).. కుప్పంలో బాబును ఓడిస్తామని సవాల్ చేస్తే.. తాజాగా ఎమ్మెల్యే రోజా (MLA Roja) చంద్రబాబు కుప్పం టూర్ పై సెటైర్లు వేశారు. ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రోజా.. బాబుపై మండిపడ్డారు. చంద్రబాబు పరిస్థితి చెతులుకాలాక ఆకులు పట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ దెబ్బ ఎలా ఉంటుందో చంద్రబాబుకు ఇప్పుడు అర్థమైందన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన బాబు కుప్పం అభివృద్ధి చేయడం, సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా రాలేదని రోజా విమర్శించారు.
కుప్పంలో ఇల్లు కట్టుకొని.., ఓటు హక్కు పెట్టుకొని ప్రజలు గర్వపడేలా చేశారా..? అని ప్రశ్నించారు. జగన్ దెబ్బ పడిన తర్వాతే కుప్పంలో ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేశారన్నారు. జగన్ పై బురద జల్లే చంద్రబాబుకు మొన్న జరిగిన కుప్పం ఎన్నికల్లో గ్రౌండ్ రియాలిటీ తెలిసొచ్చిందన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వైసీపీదే విజయమని రోజా ధీమా వ్యక్తం చేశారు. కుప్పం ప్రజలు కూడా జగన్ వైపే ఉన్నారని చంద్రబాబు గుర్తించాలన్నారు.
ఇప్పటివరకు జరిగిన ఎన్ని ఎన్నికల్లో ప్రజలు బాబును తిరస్కరిస్తుంటే మళ్లీ ముందస్తు ఎననికలంటున్నారని.. ఎన్నికలంటే అంత మోజు ఎందుకని రోజా ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలుస్తుందని రోజా సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా సీఎం జగన్ పెద్దదిక్కుగా మారి ఆదుకుంటున్నారన్నారని రోజా అన్నారు. ఇచ్చిన ప్రతివాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్న ఘనత ఆయనదేనని చెప్పారు.
ఇదిలా ఉంటే శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబును కుప్పం నుంచి పంపించడం ఖాయమన్నారు. ఇకపై మాటల్లో కాదని.. చేతల్లో చూపిస్తానని హెచ్చరించారు. ఒక సీనియర్ ఎమ్మెల్యే అయి ఉండి చంద్రబాబు జిల్లాకు, కుప్పం నియోజకవర్గానికి ఏ చేశారో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. కుప్పం ను అబివృద్ది చేయాలని చంద్రబాబు కలలుగన్నానన్న చంద్రబాబు.. 14 ఏళ్ళు సీఎం గా ఉండి ఏంచేశారని నిలదీసిన పెద్దిరెడ్డి.., 5 ఏళ్ళల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడు అయ్యారన్నారు.
చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దృదృష్టమన్న ఆయన.. సీఎం గా ఉన్నప్పుడు కుప్పంలో గ్రానైట్ మైనింగ్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు దుష్ట పరిపాలన వదిలించుకోవడానికే వైసీపీకి ప్రజలు 151 సీట్లు ఇచ్చారని.. ఇప్పుడు సిగ్గు లేకుండా కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. బాబును కుప్పంలో ఓడించి జగన్ కు కానుకగా ఇస్తామని.. ఇది తప్పకుండా జరుగుతుందన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.