TIRUPATI YSRCP MLA ROJA FACING PROBLEMS WITH ANTI GROUPS IN NAGARI CONSTITUENCY OF CHITTOOR DISTRICT FULL DETAILS HERE PRN TPT
MLA Roja: రోజాకు చెక్ పెట్టేందుకు అసమ్మతి వర్గం స్కెచ్.. ఫైర్ బ్రాండ్ ధైర్యంగా ఎదుర్కొంటారా..?
ఎమ్మెల్యే రోజా (ఫైల్)
రోజా (MLA Roja) ఆధిపత్యానికి గండికట్టేందుకు పార్టీలోని పంచ పాండవులు ఏకమయ్యారనే ప్రచారం జరుగుతోంది. నగరి నుంచి వరుసగా రెండోసారి గెలిన రోజాను స్థానిక పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఓ వైపు ప్రతిపక్ష టీడీపీ (TDP) తో పోరాడుతున్న ఆమె.. స్వపక్షంలోని వైరివర్గంతో యుద్ధం చేయకతప్పడం లేదు.
ఆర్కే రోజా (MLA RK Roja). ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YSRCP) లో ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులను తన మాటలతో ధీటుగా ఎదుర్కొగల సత్తాఉన్న నేత. అసెంబ్లీలో తన పంచ్ లతో ప్రతిపక్షాలకు ఊపిరాడనివ్వరు. ఇక తన సొంత నియోజకవర్గమైన నగరిలో ఆమెకు తిరుగులేదు. ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో ఉన్నా సరే.. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించకున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎమ్మెల్యేగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అలాంటి రోజాకు సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి ఎదురవుతోంది. రోజా ఆధిపత్యానికి గండికట్టేందుకు పార్టీలోని పంచ పాండవులు ఏకమయ్యారనే ప్రచారం జరుగుతోంది. నగరి నుంచి వరుసగా రెండోసారి గెలిన రోజాను స్థానిక పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఓ వైపు ప్రతిపక్ష టీడీపీతో పోరాడుతున్న ఆమె.. స్వపక్షంలోని వైరివర్గంతో యుద్ధం చేయకతప్పడం లేదు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రోజాకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం పనిచేసింది. పంచాయతీ ఎన్నికల్లో అమ్ములు వర్గీయులతో, పరిషత్ ఎన్నికల్లో నగరి నేతలతో మున్సిపల్ ఎన్నికల్లో కే.జే.కుమార్ వర్గీయుల నుంచి రోజాకు వ్యతిరేకత ఎదురైంది. ఇక నామినేట్ పదవుల్లోనూ సొంతపార్టీ నేతల నుండి తలనొప్పులు తప్పలేదు. రోజుకో వివాదంతో నగరి వైసీపీలో రోజాకు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఐతే అసమ్మతి వర్గం ఆడగాలను రోజా.. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాష్ట్రస్థాయి నేతల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది.
వచ్చే ఎన్నికల నాటికి రోజాకు చెక్ పెట్టాలని ఆమె వ్యతిరేక వర్గం పావులు కదుపుతోంది. ఈ క్రమంలో అసమ్మతి నేతలంతదరూ కలిసి రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. రోజాకు వ్యతిరేకంగా ఎలా ముందుకెళ్లాలనేదానిపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇందుకు వేదికగా సీఎం జగన్ జన్మదినాన్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 21న సీఎం పుట్టినరోజు సందర్భంగా అసమ్మతి వర్గాలు రోజాకు సంబంధం లేకుండా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయిచాయి. అలాగే సీఎం జన్మదిన వేడుకలను నగరిలో కాకుండా.. పుత్తూరులో నిర్వహిచాలని చూస్తోంది. ఈ అసమ్మతి సీఎం జన్మదిన వేడుకలకే పరిమితం కాకుండా.. వచ్చే ఎన్నికల నాటికి రోజాకు చెక్ పెట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. తమలో ఎవరో ఒకరు ఎమ్మెల్యే అయినా ఫర్వాలేదని.. రోజా మాత్రం గద్దెనెక్కడానికి వీల్లేదనీ అంతా భావిస్తున్నట్లు నగరిలో చర్చ జరుగుతోంది.
ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తమను కాదని... టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే తాము తిరుగుబాటు చేస్తున్నట్లు రోజా వ్యతిరేక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని సీఎం దగ్గరకు తీసుకెళ్తామని కూడా అంటున్నారు. అక్కడా న్యాయం జరగకుంటే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమని పలువురు నాయకులు అన్నట్లు సమాచారం. ఇదే అంశంపై అధిష్టానం రోజాని ప్రశ్నిస్తే.. నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి లేదని చిరునవ్వుతో సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీకి కీలకమైన నగరి నియోజకవర్గంలో అసమ్మతి రాజకీయాలకు సీఎం జగన్ ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.