Home /News /andhra-pradesh /

TIRUPATI YSRCP MLA ROJA FACING HEADACHE FROM OWN PARTY LEADERS AS MPP ELECTIONS TURNED CONTROVERSY IN NAGARI ASSEMBLY CONSTITUENCY FULL DETAILS HERE PRN BK

MLA Roja: నగరిలో రోజాకు తప్పని తలనొప్పులు... సొంత నియోజకవర్గంలో మాట నెగ్గకపోతే ఎలా..?

ఎమ్మెల్యే రోజా (ఫైల్)

ఎమ్మెల్యే రోజా (ఫైల్)

సాధారణంగా ఎంపీపీ, జెడ్పీటీసీల విషయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మాటే ఫైనల్. కానీ వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా (MLA Roja)విషయంలో మాత్రం ఆమె మాట నెగ్గడం లేదు.

    M.Bala Krishna, Hyderabad, News18

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధికారంలో ఉంది. 151 మంది ఎమ్మెల్యేలున్న ఆ పార్టీలో ఎవరికీ ఎదురులేదు. కానీ ఒక్క ఎమ్మెల్యే విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి సెగ తప్పడంలేదా..? ఒక్క ఎంపీపీ స్థానం. ఆ ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తోందా..? అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేనే చిత్తూరు జిల్లా (Chittoor District) నగరి శాసనసభ్యురాలు ఆర్కేరోజా (Nagari MLA RK Roja). ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆమెకు స్వంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు తప్పడం లేదు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీలో వర్గపోరు ఆమెకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. పరిషత్ ఎన్నికల్లో ఫలితాల తరువాత పార్టీలోని ఓ వర్గంతో రోజా బహిరంగంగ పోరాడాల్సి వస్తోంది. నగరి పరిధిలోకి వచ్చే నిండ్ర ఎంపీపీ ఎన్నిక ఎమ్మెల్యేకు చేదు అనుభవాన్ని మిగిల్చివేసింది.

    నియోజకవర్గంలోని పదవుల విషయంలో ఎమ్మెల్యే మాటే ఫైనల్ కానీ నగరిలో రోజా పరిస్థితి భిన్నంగా ఉంది. అమె ఏ నిర్ణయం తీసుకున్నా.. మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా రోజా-చక్రపాణి రెడ్డి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. మగాడివైతే పోటీ చేయ్ అని రోజా సవాల్ విసిరితే.. రోజాకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో తలపడి గెలవాలంటూ చక్రపాణి రెడ్డి ప్రతిసవాల్ విసిరారు. దీంతో జిల్లా వైసీపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

    ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీపై సంచలన ఆరోపణలు... సీఎం జగన్ కు కార్యకర్త ఫిర్యాదు


    నిండ్ర మండలంలో ఉన్న 8 ఎంపీటీసీ లకు గాను.. ఏడు చోట్ల వైసీపీ, ఒక చోట టీడీపీ గెలిచాయి. వైసీపీ ఎంపీటీసీలలో రోజా బలపర్చిన ఎంపీటీసీ ఒక్కరే ఉన్నారట. మిగిలిన ఆరుగురికి రెడ్డివారి చక్రపాణిరెడ్డి మద్దతిచ్చారట. తన మద్దతుతో గెలిచారు కాబట్టి ఎంపీపీగా తన సోదరుడు రెడ్డివారి భాస్కర్‌రెడ్డిని ఉండాలనేది చక్రపాణిరెడ్డి డిమాండ్‌. ఆయన ప్రతిపాదనను రోజా తిరస్కరించడంతో పాటు దీప అనే ఎంపిటీసీని ఎంపీపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో సమస్య మరింత ముదిరింది. తన వర్గానికి చెందిన దీపను ఎంపిపి చేయాలన్నది రోజా డిమాండ్‌.


    ఇది చదవండి: జనసేనలోకి ఇద్దరు మాజీ మంత్రులు.. ఒక మాజీ ఎమ్మెల్యే..? పవన్ స్ట్రాటజీ ఇదేనా..?


    దీంతో నిండ్ర ఎంపీటీసీల్లో చీలక వచ్చేసింది. చక్రపాణిరెడ్డి దగ్గర ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలతోపాటు టీడీపీ ఎంపీటీసీ కూడా ఆయనకే మద్దతు పలికారు. మిగిలిన ముగ్గురు వైసీపీ ఎంపీటీసీలు రోజా శిబిరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. రోజా, చక్రపాణిరెడ్డిల్లో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఈ వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఇప్పుడీ వివాదం కాస్తా తాడేపల్లికి చేరింది. రెండు వర్గాలు పోటాపోటీగా అగ్రనాయకులకు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇటీవలే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు రోజా. చక్రపాణిరెడ్డి కూడా అదే రోజు పెద్దిరెడ్డితోపాటు తాడేపల్లిలోని పార్టీ పెద్దల దగ్గరకు వెళ్లారనే టాక్ వినిపిస్తోంది.

    ఇది చదవండి: దుర్గగుడిలో వైసీపీ రంగులు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. అసలేం జరిగిందంటే..!


    మొన్న ఆగిపోయిన ఎంపీపీ ఎన్నికలను తాజాగా చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్. కూడా ఇచ్చింది. 8వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉంది. మరి శుక్రవారం నిండ్ర పంచాయితీ కొలిక్కి వస్తుందా? మళ్లీ వాయిదా పడుతుందో చూడాలి. అప్పటికి కొలిక్కి రాకపోతే పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తోందో అనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, MLA Roja, Nagari MLA Roja

    తదుపరి వార్తలు