హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLA Roja: చంద్రబాబు అలాంటోడే..! ఎమ్మెల్యే రోజా ఫైర్.. ఆ విషయంలో తగ్గేదేలేదన్న ఫైర్ బ్రాండ్..!

MLA Roja: చంద్రబాబు అలాంటోడే..! ఎమ్మెల్యే రోజా ఫైర్.. ఆ విషయంలో తగ్గేదేలేదన్న ఫైర్ బ్రాండ్..!

చంద్రబాబుపై రోజా కామెంట్స్..

చంద్రబాబుపై రోజా కామెంట్స్..

మూడు రాజధానుల ( AP 3 Capitals Issue) విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ (YSRCP) ఎమ్మెల్యే ఆర్కే రోజా (MLA Roja) స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ఎంత వరకైనా దిగజారుతారని ఆమె విమర్శించారు.

ఇంకా చదవండి ...

మూడు రాజధానుల ( AP 3 Capitals Issue) విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ (YSRCP) ఎమ్మెల్యే ఆర్కే రోజా (MLA Roja) స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ఎంత వరకైనా దిగజారుతారని ఆమె విమర్శించారు. మంగళవారం ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపలకు‌ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ దగ్గర నుండి ప్రభుత్వం లాక్కుని ఆయనకు మైక్ కూడా ఇవ్వకుండా అసెంబ్లీ నుండి పంపించాడం చూసాంమని, జరగని విషయాన్ని జరిగినట్లుగా ప్రజలందరిని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని రోజా అన్నారు. కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కొత్త రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు.

అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఏమీ జరుగలేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసం, సింపతీ కోసం చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని అన్నారు. వైసీపి నుండి ఎవరిని అవమానించిన దాఖలాలు లేవని, ఇంకా టిడిపి నాయకులే సీఎంను ఏ విధంగా మాట్లాడారో ప్రజలందరూ చూసారని ఆమె గుర్తు చేశారు. డ్రామాలు వేస్తే ప్రజలు నమ్మే పరిస్ధితిలో లేరు అనే‌ విషయం చంద్రబాబు నాయుడు గ్రహించాలన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడిన వ్యక్తే.., రాజకీయ లబ్ధి కోసం కుటుంబ గౌరవాన్ని బజారు పాలు చేయడం కరెక్ట్ కాదన్నారు.

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం మరో అనూహ్య నిర్ణయం.. మండలి రద్దు తీర్మానం వెనక్కి..?టిడిపి నాయకులు వెనుక ఉండి కేసులు వేయించి మూడు రాజధానులకు అడ్డుపడుతున్నారని.., సీఎం ప్రజల ప్రయోజనాల కోసం అభివృద్ధిని మూడు ప్రాంతాల్లో చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో అభివృద్ధి కేంద్రీకరిస్తే రాష్ట్రాలు విడి పోయినప్పుడు ఏవిధంగా ఆంధ్ర ప్రజలు నష్ట పోయారో చూసాంమని, అందుకే అమరావతిలో అభివృద్ధిని కేంద్రీకరించడం ద్వారా ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ ప్రజలు నష్ట పోతారని తెలియజేశారు. అన్ని ప్రాంతాల ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని,వారి అభిప్రాయాలను స్వీకరించిన తరువాతే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు.


ఇది చదవండి: ఏపీ మూడు రాజధానుల బిల్లుపై అనూహ్య పరిణామాలు... ఆమోదం నుంచి రద్దు వరకు ఏం జరిగిందంటే..!

కోర్టులో బిల్లు వెనక్కి తీసుకున్నారు అనగానే టిడిపి‌ నాయకులు సంకలు గుద్దు కుంటున్నారన్నారు. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. రాజధానికి, అమరావతి రైతులకు సీఎం వ్యతిరేకం కాదని, అందరితో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటాంమని‌ చెప్పినట్లు రోజా వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, MLA Roja, Ysrcp

ఉత్తమ కథలు