Shock to MLA Roja: నగరిలో ఎమ్మెల్యే రోజాకు తప్పని తలనొప్పులు.. ఆమెను టార్గెట్ చేస్తోంది ఆయనేనా..?

Mla roja

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు (MLA RK Roja) సొంత పార్టీ నేతల నుంచి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. పంచాయితీ (Panchayat Elections), కార్పొరేషన్ ఎన్నికల (Municipal Elections) సాక్షిగా తనను ఒంటరి చేయాలనే లక్ష్యంతో సొంతపార్టీ నేతలే కృషిచేస్తున్నారని రోజా ధ్వజమెత్తారు.

  • Share this:
    GT Hemanth Kumar, Tirupati, News18

    నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా (MLA RK Roja) కు సొంత పార్టీ నేతల నుంచి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. పంచాయితీ., కార్పొరేషన్ ఎన్నికల సాక్షిగా తనను ఒంటరి చేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ (YSRCP)  నేతలే కృషిచేస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. ఆ ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థులను బరిలో దింపిన రోజా ఏమాత్రం భయపడకుండా తాను అనుకున్న అభ్యర్థులను బరిలోకి దింపి.., రెండు మునిసిపాలిటీల్లోనూ తన హవా కొనసాగించారు. ఆది నుంచి ఓ వర్గం రోజాపై యుద్ధం ప్రకటిస్తూ వస్తోంది. మంచి చేయాలనీ చూసినా ఆ వర్గం నుంచి వ్యతిరేకత మాత్రం తప్పడం లేదనేది రోజా ఆరోపణ. నగరి నియోజకవర్గంలో నిండ్ర మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన చక్రపాణి రెడ్డిదే హావ ఎక్కువగా ఉంటుంది. చాల కాలంగా తన పట్టును కోల్పోకుండా.., ఎమ్మెల్యే రోజాకు మేకై మారుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

    మునిసిపల్ ఎన్నికల్లో (Municipal Elections)  రెబల్ అభ్యర్థులను నిలబెట్టడంలో ముఖ్యపాత్ర పోషించింది చక్రపాణి రెడ్డినే. తాజాగా ఎంపిపి ఎన్నికల్లో వర్గవిబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నిక ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. విజయాపురం మండలంలో ఎంపీపీ అభ్యర్థి ఎన్నికలో మెదలైన వర్గపోరు నిండ్ర మండలంలో తారస్థాయికి చేరుకుంది. విజయపురం ఎంపిపిగా రాజుల వర్గానికి చెందిన లక్ష్మీపతి రాజునూ అభ్యర్థిగా అనుకున్నారు పార్టీ వర్గాలు. తరతరాలుగా వస్తున్న ఈ ప్రతిపాదనకు రోజా అడ్డుకట్ట వేశారు.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇకపై నెలరోజులే ఈ సౌకర్యం..


    ఓ దళిత మహిళను ఎంపిపి చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్లారు. తాను ప్రతిపాదిచిన జమునను ఎంపిపిగా గెలిపించుకున్నారు రోజా. ఆ సమయంలో ఎవరు నోరు మెదపక పోయినా.. నిండ్రలో మాత్రం వర్గపోరు బహిర్గతం అయింది. నిండ్ర ఎంపిపి స్థానానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా దీపా అనే అభ్యర్థిని ఎంపిక చేసారు. అదే పార్టీలో ప్రస్తుతం శ్రీశైలం బోర్డు చైర్మన్ గా ఉన్న చక్రవన్ని రెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా చేయాలనీ ఐదుగురు ఎంపీటీసీలతో క్యాంపు రాజకీయం చేశారు. దీంతో సెప్టెంబర్ 24న జరగాల్సిన ఎన్నికలకు ఐదుగురు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే రోజా స్వయంగా రంగంలోకి దిగి కోఆప్షన్ మెంబర్ గా అనిల్ కుమార్ ను ఎంపిక చేసుకున్నారు.

    ఇది చదవండి: టీడీపీ-జనసేన మధ్య కుదిరిన పొత్తు.. వైసీపీకి చెక్ పెట్టేందుకే..!


    ఎంపీటీసీలు అందరూ రాకపోవడంతో ఎంపీపీ ఎన్నికలను వాయిదా వేయించారు. నేడు జరగాల్సిన ఎన్నికకు కూడా చక్రపాణి రెడ్డి వర్గం అడ్డుతగిలే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నిక జరిగే చోట చక్రపాణి రెడ్డి వర్గీయులు ధర్నాకు దిగారు. భాస్కర్ రెడ్డిని ఎంపీపీ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. దీంతో నగరిలో వర్గపోరు మరోమారు తేటతెల్లం అయిందనే చెప్పుకోవాలి. ప్రజల మనసు గెలిచినా రోజాకు పార్టీలో కొన్ని వర్గాల వద్ద నుంచి వ్యతిరేకత తప్పడం లేదు.
    Published by:Purna Chandra
    First published: