Home /News /andhra-pradesh /

TIRUPATI YSRCP MLA AND JABARDASTH JUDGE RK ROJA TRYING FOR MINISTER POST IN FUTURE AS YS JAGAN MIGHT CONSIDER HER IN WOMENS QUOTA ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

MLA Roja: రోజాకు కేబినెట్ బెర్త్ ఖాయమైందా...? అందుకే జబర్దస్త్ ను వదిలేస్తున్నారా..?

ఎమ్మెల్యే రోజా (ఫైల్)

ఎమ్మెల్యే రోజా (ఫైల్)

ప్రస్తుతం జబర్దస్త్ (Jabardasth) ను కూడా కొన్నాళ్లు పక్కనబెట్టిన రోజా (MLA Roja).. రాజకీయంగా మరింత ఎదిగేందుకు గట్టిప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది.

  ఆర్కే రోజా. అధికార వైఎస్ఆర్సీపీలో ఛరిష్మా గల మహిళా నేత. ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా తన మార్క్ చూపిస్తూనే.., అటు బుల్లితెరపైనా జబర్దస్త్ ప్రోగ్రామ్ తో హవా కొనసాగిస్తున్నారు. ఆమె ఎక్కడికెళ్లినా ప్రత్యర్థులపై బుల్లెట్ల లాంటి మాటలతో విమర్శలు చేస్తారు. ఇటు బుల్లితెరపై నవ్వులు పూయిస్తారు. అలాంటి రోజా అధికార పార్టీకి చాలా కీలకం. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఐతే తిరుపతి ఉప ఎన్నికల అనారోగ్య కారణాలతో సర్జరీ చేయించుకున్న ఆమె ప్రచారంతో పాటు పోలింగ్ కు కూడా దూరమయ్యారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేస్తున్నారు. ఆన్ లైన్లోనే అధికారులు, స్థానిక నేతలతో సమావేశమవుతూ తనపని చేసుకుపోతున్నారు. తనకు ఎంతో పాపులాటిరీ తెస్తున్న జబర్దస్త్ షోను కూడా ప్రస్తుతానికి రోజా పక్కనబెట్టారు.

  అటు రాజకీయాల నుంచి, ఇటు టీవీ షో నుంచి ఎలాగూ గ్యాప్ రావడంతో ఆమె దీనిని పొలిటికల్ గా సద్వినియోగం చేసుకునేందుకు ట్రై చేస్తున్నారన్న టాక్ పార్టీలో వినిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు చిత్తూరు జిల్లాలోనూ కీలక పాత్ర పోషిస్తున్న రోజా ఎప్పటి నుంచో మంత్రిపదవిని ఆశిస్తున్నారు. 2019లోనే మహిళల కోటాలో పదవి వస్తుందని భావించారు. కానీ కొన్ని సామాజిక సమీకరణాల వల్ల అది సాధ్యం కాలేదు.

  ఇది చదవండి: సెకండ్ వేవ్ లో ఇదే గుడ్ న్యూస్... ఒక్కరోజులో 11వేల మంది డిశ్చార్జ్


  రోజాకు మంత్రిపదవికి దక్కకపోవడానికి ప్రధాన కారణం.. పార్టీలోని కొందరు ముఖ్యనేతలతో తనకున్న విభేదాలేనని రోజా చాలాసార్లు చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితో రోజాకు పెద్దగా సఖ్యత లేదన్న ప్రచారం సాగుతోంది. ఈసారి మాత్రం రోజా మంత్రిపదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని గతంలోనే సీఎం జగన్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆరు నెలలు ముందుగానే రోజా ప్రయత్నాలు మొదలుపెట్టారట. పార్టీలో విభేదాలను పక్కనబెట్టి పనిచేస్తున్నాని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబల్స్ ను ఎదిరించి పార్టీ గెలిపించానని.. అలాగే కీలక అంశాల్లో ప్రతిపక్షాలకు కౌంటర్స్ ఇస్తున్నందున మంత్రివర్గంలో చేయబోయే మార్పుల్లో తనకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని రోజా.. సీఎం జగన్ ను కోరినట్లు సమాచారం.

  ఇది చదవండి: కరోనా టైమ్ లో ఇతడే రియల్ హీరో... చిన్నవాడైనా పెద్దమనసు...


  అదే ప్లస్ పాయింట్..
  ఇక్కడ రోజాకు మరో ప్లస్ పాయింట్ కూడా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. తొలుత తెలుగుదేశంలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆమె 2014లో ఎమ్మెల్యేగా గెలిచినా.. పార్టీ అధికారంలోకి రాలేదు. 2019లో వరసుగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిపదవిని ఆశించినా.. సాధ్యం కాకపోవడంతో ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ బాధ్యతలు చేపట్టారు. ఈసారి మాత్రం మంత్రి పదవే లక్ష్యంగా రోజా పావులుకదుపుతున్నారు. మరోవైపు త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో రోజాకు క్యాబినేట్‌లో చోటు ఖాయం అనే మాటలు వినబడుతున్నాయి. ఆమెకు సినిమాటోగ్రఫీతో పాటు మరేదైనా ముఖ్యశాఖ అప్పగించే అవకాశాలున్నట్టు సమాచారం. మరి ఎమ్మెల్యే రోజా... మినిస్టర్ రోజా అవుతారా లేదా అనేది వేచి చూడాలి..

  ఇది చదవండి: వెంకన్న దర్శనానికి కరోనా ఎఫెక్ట్... మూగబోయిన తిరుమలగిరులు

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Jabardasth, MLA Roja, Rk roja, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు