MLA Roja Comments: ఎక్కువ మాట్లాడితే అంతు చూస్తా..! తెలంగాణ మంత్రులకు రోజా వార్నింగ్

ఎమ్మల్యే రోజా (ఫైల్)

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నెలకొన్న నీటి వివాదంపై (AP-TS Water War) వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా (YSRCP MLA RK Roja) స్పందించారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నెలకొన్న నీటి వివాదంపై వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న ఆమె... తెలంగాణ ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోవడం చాల దారుణమని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేయద్దని చేతులు జోడించి కొట్టుకుంటున్నానని తెలిపారు. రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏపీకి కేటాయించిన నీరు విడుదల చేయకుండా అన్యాయం చేయాలి అనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమస్య సామరస్యంగా పరిస్కారం అవ్వాలని స్వామివారిని ప్రార్ధిస్తున్నాని.., కేంద్ర జలవనరుల శాఖ చొరవ చూపి న్యాయమైన వాటిని ఇప్పించాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణ మంత్రులు ఏపీపై రాళ్లురువ్వి తరువాత ఇది మా వ్యక్తిగత మాటలు అనటంలో ఆంతర్యం ఏంటి ప్రశ్నించారు. సీఎం జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. నాగార్జున సాగర్, పులిచింతల, శ్రీశైలం లో అక్రమ విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలి డిమాండ్ చేశారు.

  దేశంలో మహిళా రక్షణ కోసం ఇంతవరకు ఏ సీఎం చేయని విధంగా సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు. దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసి దిశా యాప్ ద్వారా ప్రతి గడపలో ఉన్న మహిళకు రక్షణ కల్పిస్తున్నారని రోజా చెప్పారు. మహిళలకు ఇది చాల సంతోషమైన విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మహిళల గురించి ఆలోచించలేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళపై లైంగిక దాడులు జరిగినా పట్టించుకోలేదు విమర్శించారు. అలాంటి చంద్రబాబు., తెలుగు మహిళలు జగన్ పై బురదజల్లే ప్రయత్నం హాస్యాస్పదమన్నారు. టీడీపీ తెలుగు మహిళలను కాపాడేది కూడా...సీఎం జగన్ తీసుకొచ్చిన కొత్త చట్టమేనని గుర్తు చేశారు.

  ఇది చదవండి: మహిళల న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడ్డంగా బుక్కైన హెడ్ కానిస్టేబుల్..


  రాష్ట్రంలోని ప్రతి మహిళలకు ఆర్థిక భరోసా సీఎం జగన్ ఇస్తున్నారని అన్నారు. ప్రతి పేదవాడికి కళగా మిగిలిన స్వంత ఇంటి కళ సాకారం చేసారని చెప్పారు. ప్రతిదీ రాజకీయం చేయాలనీ తెలుగుదేశం పార్టీ చూస్తోందన్నారు. టీడీపీ నాయకులు పీకలదాకా మెక్కి దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న ఎమ్మెల్యే రోజా... ఏపీలో మాత్రమే టెస్టింగ్ నుంచి చికిత్స వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నమని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారు, సీఎం జగన్, ప్రజల ఆశీస్సులతో రెండు ఆపరేషన్స్ జరిగి బ్రతికి బయట పడ్డానన్నారు. రెట్టింపు ఉత్సహంతో జననన్న పధకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

  ఇది చదవండి: ఈగలు నిజంగానే పగబడతాయా..? ఆ రెండు గ్రామాలపై ఎందుకు దండెత్తాయి..?

  Published by:Purna Chandra
  First published: