TIRUPATI YSRCP MLA ANA JABARDASTH JUDGE ROJA SENSATIONAL COMMENTS ON MOVIE TICKETS ISSUE IN ANDHRA PRADESH FULL DETAILS HERE TPT PRN
MLA Roja: సినిమా టికెట్లపై రోజా కీలక వ్యాఖ్యలు.., వాళ్లు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్న ఫైర్ బ్రాండ్
ఎమ్మెల్యే రోజా (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల అంశం (Movie Tickets Issue) ఇటీవల రాజకీయ రంగుపులుముకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు అధికార వైసీపీ (YSRCP) పై మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల అంశం (Movie Tickets Issue) ఇటీవల రాజకీయ రంగుపులుముకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు అధికార వైసీపీ (YSRCP) పై మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలకు, సినీ నటులకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర ఏళ్లలో 99 శాతం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్ దేనని రోజా అన్నారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పేదలకు సొంత ఇంటి కళ సహకారం చేసారని, తమ ఉనికి కాపాడుకునేందుకే టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె విమర్శించారు.
రాష్ట్రంలో బీజెపి తీరు హస్యాస్పదంగా ఉందని.., బీజేపి, టీడీపీలపై ప్రజలు ఆగ్రహంతో ఉంటే బీజెపీ జనాగ్రహ సమావేశాలు నిర్వహించడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని రోజా విమర్శించారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం, పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయించడంలో బీజేపీ వైఫల్యం చెందిందన్నారు. ఎన్ని విపత్తులు వచ్చినా కుంటిసాకులు చెప్పకుండా సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలందిస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలకు అండగా ఉన్న ఏకైన సీఎం జగనే అని.., కేవలం జగన్ పై బురదజల్లేందుకే రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం తగదన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకుల స్క్రిప్ట్ ను బీజేపీ నాయకులు చదువుతున్నారని.., టీడీపీ, బీజీపీ పార్టీలు... వారు అధికారంలో ఉంటే చేయరని.. చేసేవాళ్లను చేయనివ్వరని రోజా ఎద్దేవా చేశారు.
ఇక సినిమా టికెట్ల అంశంపై స్పందించిన రోజా.., చిన్న సినిమాలకు సినిమా హాల్ కావాలన్నా.., పేదలకు తక్కువ ధరలకే సినిమా చూడాలన్నా టికెట్ల రేట్లు తగ్గించక తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమా వాళ్ళు బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తమకు ఇబ్బంది అని చెప్తున్నారన్నారు. ప్రభుత్వం కమిటీతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. ఫ్రెండ్లీ నేచర్ కలిగిన జగన్ లాంటి సీఎంలను చూసి ఉండరన్న రోజా.., ప్రొడ్యూసర్స్, చిరంజీవి., నాగార్జునతో పాటు పలువురు సినీ పెద్దలు కోరితేనే సినిమా టికెటింగ్ వ్యవస్థను ఆన్ లైన్ చేసినట్లు రోజా తెలిపారు. సినిమా టికెట్ల వ్యవహారాన్ని పొలిటికల్ గేమ్ కోసం కొందరు నాయకులు పావుగా వాడుకుంటున్నట్లు రోజా ఆరోపించారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా గ్రామాన్ని దత్తతకు తీసుకోవడం మనస్సుకు సంతృప్తిని ఇచ్చే విషయంమని, ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తానని రోజా హామీ ఇచ్చారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.