Home /News /andhra-pradesh /

TIRUPATI YSRCP LEADERS GIVES SHOCK TO MLA ROJA ON CM YS JAGAN MOHAN REDDY BIRTHDAY FULL DETAILS HERE PRN TPT

Shock to MLA Roja: సీఎం బర్త్ డే సాక్షిగా రోజాకు షాక్.. అన్నంత పనీ చేసిన అసమ్మతి నేతలు..

నగరి వైసీపీలో వర్గ విభేదాలు

నగరి వైసీపీలో వర్గ విభేదాలు

వైసీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా (MLA RK Roja) కు నగరి నియోజకవర్గంలో అసమ్మతి ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ అసమ్మతి వర్గాలు తయారైన సంగతి తెలిసిందే. ఐతే సీఎం జగన్ పుట్టిన రోజు సందర్బంగా స్థానిక నేతలు షాకిచ్చారు.

ఇంకా చదవండి ...
    వైసీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా (MLA Roja) కు నగరి నియోజకవర్గంలో అసమ్మతి ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ అసమ్మతి వర్గాలు తయారైన సంగతి తెలిసిందే. ఐతే సీఎం జగన్ పుట్టిన రోజు సందర్బంగా స్థానిక నేతలు షాకిచ్చారు. జగన్ పుట్టిన రోజును నగరిలో ఘనంగా నిర్వహించాలని రోజా అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేశారు. కానీ రోజాకు అసమ్మతి వర్గం గట్టిషాకే ఇచ్చింది. నగరంలో రోజాకు ధీటుగా సీఎం జగన్ బర్త్ డే వేడుకలను నిర్వహించారు. అంతేకాదు నగరిలో ఎక్కడ చూసినా రోజా ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

    సీఎం జన్మదినం సందర్భంగా నగిరి నియోజకవర్గంలోని ఏకాంబర కుప్పం నుండి వైసీపి నాయకులు,కార్యకర్తలు, పార్టీ అభిమానులతో రోజా భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ఉన్న బ్యానర్లలో రోజో ఫోటో లేని బ్యానర్లే దర్శనం మిచ్చాయి.. ఇటీవల్ల నగరి నియోజకవర్గంలో అధికార పార్టి నాయకుల మధ్య కొమ్ములాట బహిర్గతం అయ్యిన విషయం తెలిసిందే. కానీ అవి పార్టీ వరకే పరిమితమవుతాయని అందరూ భావించారు. ఐతే ఎమ్మెల్యే లేని బ్యానర్ లు చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. తమ ఎమ్మెల్యే లేకుండా బ్యానర్ చూడలేంమని అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఇది చదవండి: ఆ మంత్రికి ముందుగానే వరమిచ్చిన సీఎం జగన్..? ఐదేళ్లు పదవికి ఢోకా లేనట్లేనా..?


    ఇదిలా ఉంటే ‌నగరిలోని నాలుగు మండలాల ముఖ్య నేతలు రోజా లేకుండానే పుత్తూరులో సీఎం పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఒకే పార్టీకి చెందిన నాయకులు ఒకే నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో కలిసి మెలసి ఉండాలని పార్టి కేడర్ అంటుంది.

    ఇది చదవండి: ఏపీలో కాపులదే రాజ్యం.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీ వైపు చూస్తున్నారా..?

    గత కొంతకాలంగా రోజాపై అసమ్మతి నేతలు తిరుగుబావుటా ఎగరవేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారని విమర్శలు కూడా వచ్చాయి. అలాగే నిండ్ర మండల ఎంపీపీ ఎన్నిక విషయంలో మండల పరిషత్ కార్యాలయంలోనే రోజాకు మరో నేతకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీనిపై అధిష్టానం కలగజేసుకోవడంతో రోజా తనమాట నెగ్గించుకున్నారు. తాజా పరిణామాలను కూడా రోజా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని.. జగనన్న తనకు అండగా ఉన్నంత కాలం తనను ఎవరూ ఏమీ చేయలేరని రోజా బల్లగుద్ది చెబుతున్నారు. నగరి ప్రజల ఆశీర్వాదం, సీఎం జగన్ అండ తనకే ఉన్నాయని రోజా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, MLA Roja, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు