హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP Leader Warning: కాంట్రాక్టర్ కు వైసీపీ లీడర్ వార్నింగ్... అధికారపార్టీకి మళ్లీ తలనొప్పులు..

YSRCP Leader Warning: కాంట్రాక్టర్ కు వైసీపీ లీడర్ వార్నింగ్... అధికారపార్టీకి మళ్లీ తలనొప్పులు..

అనంతపురం జిల్లాలో కాంట్రాక్టర్ కు వైసీపీ నేత బెదిరింపులు

అనంతపురం జిల్లాలో కాంట్రాక్టర్ కు వైసీపీ నేత బెదిరింపులు

AP Politics: రాష్ట్రంలో ఎక్కడ పనులు జరిగినా ఆ పార్టీ నేతల హస్తం ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లి అవి బెదిరింపుల వరకు వెళ్తుంటాయి. అనంతపురం (Anantapuram District) జిల్లాల్లో ఓ వైసీపీ (YSRCP) నేత కాంట్రాక్టర్ ను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...

  ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ నేతలతే ఆధిపత్యం. తాము ఏం చెప్తే అది జరగాలనే ఆ పార్టీ నేతలు భావిస్తుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ పనుల టెండర్లు, ఇతర వ్యవహారాల్లో తాము చెప్పేందే జరగాలంటారు. ఇక ఎమ్మెల్యేలైతే నియోజకవర్గంలో చీమచిటుక్కుమన్నా తమకు తెలియాల్సిందేనని పట్టుపడుతుంటారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల విషయంలోనూ ముందుగా కాంట్రాక్టర్ ఎమ్మెల్యే దగ్గరికెళ్లి మాట్లాడాలి లేదంటే పనులు జరగవ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైఎస్ఆర్సీపీ (YSRCP) అధికారంలో ఉంది. రాష్ట్రంలో ఎక్కడ పనులు జరిగినా ఆ పార్టీ నేతల హస్తం ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లి అవి బెదిరింపుల వరకు వెళ్తుంటాయి. అనంతపురం జిల్లాల్లో ఓ వైసీపీ నేత కాంట్రాక్టర్ ను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. ఓ ఎమ్మెల్యే అనుచరుడు బరితెగించి మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి.

  వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా (Anantapuram District) రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి (MLA Kapu Ramachandra Redd) అనుచరుడు, వైసీపీ నేత అయిన జయరామిరెడ్డి.. ఓ రోడ్డు నిర్మాణ పనుల విషయంలో కాంట్రాక్టర్ ను బెదిరించారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి రూ.17 కోట్ల రూపాయలతో 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులను డీఎంసీ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. దీంతో వారు రోడ్డు పనులు మొదలుపెట్టారు.

  ఇది చదవండి: శేషాచలంలో రియల్ పుష్ప మూవీ సీన్... స్మగ్లర్లు ఎలా చిక్కారంటే..!


  ఐతే ఈ కాంట్రాక్ట్ తనకు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.., రోడ్డుపనులు వెంటనే నిలిపేయాలని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులు ఎలా చేస్తావని ఆవేశంగా మాట్లాడుతూ.. పనులు వెంటనే ఆపకపోతే భౌతికదాడులకు దిగుతామని బెదిరించారు.

  ఇది చదవండి: ఫుల్ బాటిల్ ఇస్తే మీ ఫ్యూచర్ మీ చేతిలో పెట్టేస్తాడు.. తంబీలతో ఆడుకుంటున్న తెలుగు బాబా...


  స్థానికంగా కాంట్రాక్టర్ అయిన కలేకుర్తి జయరామిరెడ్డి భార్య ఉషారాణి ప్రస్తుతం రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన స్వగ్రామం కనేకల్ మండలం కలేకుర్తి. సొంతమండలంలోనే కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోవడంతో ఆయన ఇలా బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఐతే దీనిపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్పందించలేదు.

  ప్రతిపక్షాల మండిపాటు

  ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు వైసీపీని తప్పుబడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉండే.. రోడ్లు వేసే కాంట్రాక్టర్లనే బెదిరిస్తారా..? అని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకురారని విమర్శిస్తున్నాయి. హైకోర్టు వద్ద కొత్త భవనం నిర్మించేందుకు కేవలం ఒకే ఒక్క కాంట్రాక్టర్ టెండర్ వేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పుకుంటున్నారు. తీవ్ర విమర్శల పాలవుతున్న ఈ బెదిరింపు వ్యవహారంపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, అధికార వైఎస్ఆర్సీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Ysrcp

  ఉత్తమ కథలు