Tirupati By poll Result: తిరుపతిలో గురుమూర్తికి ఆధిక్యం... ఆశలు వదిలేసుకున్న టీడీపీ, బీజేపీ

ప్రతీకాత్మకచిత్రం

తిరుపతిలో (Tirupati by Election) ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేదిశగా కౌంటింగ్ సాగుతోంది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి (YSRCP Candidate Gurumurthy) ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న తిరుపతి ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్.గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. వైసీపీ ఆశించిన విధంగా భారీ మెజారిటీ సాధించే దిశగా సాగుతున్నారు. మరోవైపు టీడీపీ గట్టిపోటీనివ్వలేకపోయినా గణనీయంగా ఓట్లు సాధిస్తోది. 9 రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్ఆర్సీపీకి 1,76,992, టీడీపీకి లక్ష ఓట్లు, బీజేపీకి 17,249 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం గురుమూర్తి 76,609 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీకి 57శాతం, టీడీపీకి 31శాతం, బీజేపీకి 5శాతం ఓట్లు పోలయ్యాయి. ఫలితంపై ఇప్పటికే అంచనా రావడంతో టీడీపీ పూర్తిగా డీలా పడింది. ఓటమి ఖాయమైనట్టే అని టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఎంతో ఆశగా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చి.. చాలా ఉత్సాహంగా కనిపించిన ఆమె.. ఐదో రౌండ్ ఫలితలు చూశాక.. ఇక గెలవడం కష్టమే అని అభిప్రాయానికి వచ్చినట్టు ఉన్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రం నుంచి ఆమె వెంటనే వెనుతిరిగారు.

    తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ద్వారా ఏపీలో అడుగు పెట్టాలి.. లేదా కనీసం ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పేలా రెండో స్థానంలో నిలవాలని ఆశించింది. వైసీపీ, టీడీపీకి పోటాపోటీగా ప్రచారం నిర్వహించింది. పనవ్ ప్రచారం,.. జనసేన అభిమానులు ఓట్లు తమను గట్టెక్కిస్తాయని ఆశించింది. కానీ ప్రస్తుతం ఫలితం చూస్తుంటే బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతోంది. రెండో స్థానంలో సంగతి పక్కన పెడితే డిపాజిట్ రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఏ నియోజకవర్గంలోనూ ఆశించిన స్థాయి ఓట్లు రావడం లేదు. ఐదు రౌండ్లలో కలిపి కనీసం ఐదు వేల ఓట్లు కూడా బీజేపీ రాలేదు అంటే ఓటర్లు ఏ రేంజ్ లో షాక్ ఇచ్చారు అన్నది అర్థం చేసుకోవచ్చు..

    తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది అన్నది అందరూ ఊహించిందే. మెజార్టీ ఎంత అన్నదానిపైనే అంతా లెక్కలు వేసుకున్నారు. దీంతో రెండో స్థానం ెఎవరిది అన్నదానిపైనే అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఓటింగ్ ట్రెండ్ చూస్తే వైసీీపీకి టీడీపీ ఊహించిన స్థాయిలో పోటీ ఇవ్వకపోయినా రెండో స్థానాన్ని మాత్రం పనబాక లక్ష్మి నిలబెట్టుకుంది. బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయినా.. ఊహించిన ఓట్లు రావడం లేదు. జనసేన పొత్తు ఆ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదని అర్థమవుతోంది. దీంతో ఈ రెండు పార్టీ పొత్తుపై అనుమానాలు పెరుగుతున్నాయి.
    Published by:Purna Chandra
    First published: