TIRUPATI YSR CONGRESS PARTY SLAMS JANASENA PARTY CHIEF PAWAN KALYAN OVER CRITICISM DURING TIRUPATI BY POLL CAMPAIGN FULL DETAILS HERE PRN GNT
Tirupati By Poll: హీటెక్కిన తిరుపతి రాజకీయం... జనసేనానినే టార్గెట్ చేసిన వైసీపీ
మంత్రి పేర్ని నాని (ఫైల్)
తిరుపతి ఉపఎన్నిక (TIrupati By poll) ప్రచారంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ (YSRCP), జనసేన (Janasena) నేతల మధ్య విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి.
తిరుపతి ఉప ఎన్నిక (Tiruapti By Poll) ప్రచారాలతో ఏపీలో రాజకీయాలు పూర్తిగా హీటెక్కాయి. దీనికి తోడు పరిషత్ ఎన్నికల పోరు కూడా పార్టీలను పరుగులు పెట్టిస్తోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ల్యాంగ్ గ్యాప్ తరువాత ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు జనసేన అధినేత పవన్ కళ్యాన్ (Janasena Chief Pawan Kalyan). తిరుపతి ఉప ఎన్నికలో మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున తిరుపతిలో సుడిగాలి పర్యటన చేశారు. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో అధికార, విపక్షాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల వేళా ఒకరిపై ఒకరు సెటైర్లు ఘాటు విమర్శలతో నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మొన్న సియం జగన్.., జనసేన అధినేత పవన్ లపై ఫ్యాన్స్ సారంగ దరియా పాటకు పేరడీ ట్యూన్ కట్టి సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేశారు. నెట్టింట్లో ఈ దుమారం రేగుతుండగానే తాజాగా జనసేన అధినేత పవన్ పై మంత్రి పేర్ని నాని డైలాగ్ వార్ కు దిగటం రాజకీయ వేడిని పుట్టిస్తోంది
తిరుపతి టూర్ లో సీఎం జగన్ ను టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్.., వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా నిందితులను పట్టుకోలేకపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలపై పేర్ని నాని మండిపడ్డారు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్న విషయం గుర్తు పెట్టుకోవాలంటూ పవన్ కు కౌంటర్ ఇచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కేసు దర్యాప్తులో పురోగతి తీసుకురావచ్చు కదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ నేతలకు తానంటే భయమని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని.., “అవును పవన్‌ను చూసి తాము భయపడిపోయి... ఒళ్లంతా తాయొత్తులు కట్టించుకుంటున్నాం” అంటూ ఎద్దేవా చేశారు.
వానాకాలంలో వానలు వచ్చినట్లు ఎన్నికలు వచ్చినప్పుడే పవన్ నాయుడు వస్తారని పేర్ని నాని విమర్శించారు. కాపులు, బలిజలకు కష్టమొచ్చినప్పుడు ఏనాడు మాట్లాడని వ్యక్తి... ఇప్పుడు కేవలం వారి ఓట్ల కోసమే కులాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ద్రోహం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాపు ఉద్యమకారులపై అన్యాయంగా కేసులు పెడితే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కేవలం ఓట్లు వచ్చినప్పుడే పవన్‌కు కులాలు గుర్తుకొస్తాయని విమర్శించారు.
ఏం పొడిచారని పవన్‌ను చూసి భయపడాలి కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడితో తిరిగితిరిగి పవన్ కల్యాణ్ సొల్లు మాటలు ఎక్కువై పోయాయని నాని ఘాటుగా విమర్శించారు. మొత్తంగా తిరుపతి బైపోల్, పరిషత్ పోరు వేళా అధికార విపక్ష పార్టీల నేతల మధ్య విమర్శల దాడి ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.