Home /News /andhra-pradesh /

TIRUPATI YOUTH BRUTALLY BEATEN BY ROWDY GANG FOR SEEING HIS FACE IN MARRIAGE FUNCTION IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Shocking: భోజనం చేస్తుంటే చూశాడని చావబాదాడు.. ఇదేం గొడవరా బాబు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chittoor: పెళ్లంటే వందలమంది ఒకేసారి భోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒకరికి ఒకరు ఎదురుపడటం.. చూసుకోవడం కామన్. అందులో ఎలాంటి హేళనలు, కోపాలు, తాపాలుండవు, కానీ భోజనం చేస్తుండగా తనను చూశాడన్న కోపంతో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. తననెందుకు చూశావంటూ చావబాదాడు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    పెళ్లి అంటే బంధు మిత్రుల మడమ కోలాహలంగా ఉంటుంది. వివాహవ వేడుకకు వచ్చిన వారందరికీ సంప్రదాయ రీతిలో భోజనాలు పెడతారు. వందలమంది ఒకేసారి భోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒకరికి ఒకరు ఎదురుపడటం.. చూసుకోవడం కామన్. అందులో ఎలాంటి హేళనలు, కోపాలు, తాపాలుండవు, కానీ భోజనం చేస్తుండగా తనను చూశాడన్న కోపంతో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. తననెందుకు చూశావంటూ చావబాదాడు. దీంతో యువకులంతా ఆస్పత్రిపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) మదనపల్లె పట్టణానికి మధుకుమార్‌ 30, అసిఫ్‌ (25), వినోద్‌ (28), మంజునాథ్‌ (24)తో పాటు మరి కొంతమంది స్థానిక మిషన్‌ కాంపౌండ్‌ సీఎస్‌ఐ పెళ్లి మండలంలో జరిగిన మిత్రుడు వివాహానికి ఆదివారం హాజరయ్యారు.

    అప్పటి వరకు అందరూ సరదాగా హాయిగా గడిపేశారు. అందరూ ఇంటికి వెళ్తున్న సమయం.., ఇంతలో బిగ్గరగా అరుపులు కేకలు వినిపించాయి. ఇంతలో అంతా కంగారుగా పరుగులు పెట్టగా షాకింగ్ సీన్ కనిపించింది. దేవళం వీధికి చెందిన రౌడీషీటర్‌ సుల్తాన్‌ వర్గీయులు మధుకుమార్‌ వర్గీయులతో భోజనం తినే సమయంలో తమవైపు చూశారన్న కారణంతో గొడవకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పెళ్లిబృందం ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని అందరూ భావించారు. రాత్రి 10 గంటల సమయంలో స్థానిక మాలిక్‌ ఫంక్షన్‌హాల్‌ దగ్గర మధుకుమార్‌ వర్గీయులు ఉన్నారు.

    ఇది చదవండి: భర్తను వదిలేసి ప్రియుడే లోకమనుకుంది.. కానీ అంతలోనే ఊహించని పరిణామం..


    ఇంతలోనే సుల్తాన్, తన అనుచురులతో కలసి అక్కడ చేరుకున్నారు. దాడి చేయాలన్న ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న రాళ్లతో దాడికి దిగారు. దీంతో మధువర్గంలోని వారంతా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మధుకుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు తరలించారు. ఆసిఫ్, వినోద్, మంజునాథ్‌ను కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వన్‌టౌన్‌ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

    ఇది చదవండి: కాకినాడలో మిస్సింగ్.. విజయవాడలో ప్రత్యక్షం.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యువతి..


    రౌడీషీటర్‌ సుల్తాన్‌ ఆగడాలు పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయని... ఇందుకు సాక్షం వరుసగా అతను ప్రజలపై చేస్తున్న దాడులే అని స్థానికులు చెప్తున్నారు.ప్రశాంతంగా ఉన్న పట్టణంలో అలజడి సృష్టిస్తున్న అల్లరి మూకలపై పోలీసులు కేసులు నమోదు చేయకుండా చోద్యం చేస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సుల్తాన్‌ దేవాలయ వీధికి చెందిన ఉదయ్‌కుమార్, కిరణ్, ప్రకాష్, వాసుపై దాడులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుల తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Crime news

    తదుపరి వార్తలు