Nellore Girl: ఆమెపాలిట శాపంగా మారిన పవర్ కట్... ఆ నలుగుర్ని ఏంచేసినా పాపం లేదు..

ప్రతీకాత్మక చిత్రం

చేతిలో దిశ యాప్ (Disha App) ఉన్నా.. నిర్భయలాంటి చట్టాలున్నా(Nirbhaya Act) కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. కామంతో కళ్లుమూసుకుపోతున్న కొందరు కీచకులు అభంశుభం ఎరుగని చిన్నారులను చిదిమేస్తున్నారు.

 • Share this:
  GT Hemant Kumar, Tirupati, News18

  ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా మానవ మృగాల్లో భయం రావడం లేదు. కొన్ని ఘటనల్లో ఉరిశిక్షలు పడినా భయమనే మాటకే అర్థం లేకుండాపోతోంది. చేతిలో దిశ యాప్స్ ఉన్నా.. నిర్భయలాంటి చట్టాలున్నా కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. కామంతో కళ్లుమూసుకుపోతున్న కొందరు కీచకులు అభంశుభం ఎరుగని చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని నెల్లూరు జిల్లాలో (Nellore District) మరో ఘోరం జరుగింది. మైనర్ బాలికపై నలురుగు మృగాళ్లు ఘాతుకానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ అకృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కొండాపురంలోని అరుంధతివాడలో ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. స్థానికంగా ఎలాంటి దుకాణాలు లేకపోవడంతో చిన్నవస్తువు కావాలాన్నా పక్కనే ఉన్న రామానుజపురంకు వెళ్లాల్సిందే.

  అదే ఆ మైనర్ బాలికపట్ల పాలిట శాపంగా మారింది. గురువాతం రాత్రి భోజన సమయానికి ఇంట్లో పెరుగు లేకపోవడంతో తల్లిదండ్రులు పెరుగుప్యాకెట్ తీసుకురావాలని బాలికను రామానుజపురానికి పంపించారు. బాలిక షాపుకెళ్లి పెరుగుప్యాకెట్ తీసుకొని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఉండగా గ్రామంలో కరెంట్ పోయింది. అప్పటికే బాలికపై కన్నేసిన నలుగురు యువకులు.. ఆమెను ఊరిచివర ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు. బాలిక కేకలు వేయకుండా నోటిని గుడ్డతో కట్టేశారు. కాళ్లు చేతులు కట్టేసి బాలికను వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.

  ఇది చదవండి: అమెరికా అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్... కొన్నాళ్ల తర్వాత మనోడికి చుక్కలు చూపించింది...


  ఇంతలో బాలిక కేకలు విన్న స్థానికులు చెరువుకట్టవైపుకు వెళ్లగా ఆ యువకులు పారిపోయేందుకు యత్నించారు. వీరిలో ఒకర్ని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడ్డ మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే గ్రామానికి చెందిన ఓపార్టీ నేతలు కేసును నీరుగార్చి యువకులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: మేనకోడలిపై కన్నేసిన మేనమామ... ఆమె భర్త హత్యకు సుపారీ.. చివరకు ఎలా చిక్కారంటే..!  గతంలో కర్నూలు జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికకు చాక్లెట్ ఆశచూపి అత్యాచారానికి యత్నించగా బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇదే జిల్లాలో మేక పిల్ల కోసం వెళ్లిన ఓ బాలికను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన ఓ యువకుడు అత్యాతారానికి పాల్పడగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  ఇది చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త హత్యకు సుపారీ.. పక్కా స్కెచ్ వేసినా దొరికిపోయింది...


  రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు చిన్నారులపై తాతవరసయ్యే ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్నిరోజులుగా జరుగుతున్న ఈ ఘోరం బయటపడటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలున్నా మృగాళ్లు రెచ్చిపోతుండటంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: