TIRUPATI YOUNG WOMAN KILLED BY BOY FRIEND AFTER REJECTING FOR LOVE MARRIAGE IN NELLORE DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Nellore News: పెద్దల మాటకు తల వంచడమే ఆమె చేసిన పాపం.. నెల్లూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
కావ్య (ఫైల్)
ఎంతమందికి కఠిన శిక్షలు విధించినా.. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీవలే గుంటూరు (Guntur) లో ఇంజనీరింగ్ విద్యార్థి రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా (Nellore District) లో దారుణం జరిగింది
ఎంతమందికి కఠిన శిక్షలు విధించినా.. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీవలే గుంటూరు (Guntur) లో ఇంజనీరింగ్ విద్యార్థి రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా (Nellore District) లో దారుణం జరిగింది. పొదలకూరు మండలం తాటిపర్తిలో ప్రేమ వ్యవహారం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ప్రేమ విషయంలో విభేదాలు తలెత్తడంతో కావ్య అనే యువతిని సురేష్ రెడ్డి అనే యువకుడు రివాల్వర్ తో కాల్చి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా అదే గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సురేష్, కావ్య చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు.
కొంతకాలంగా సురేష్ రెడ్డి, కావ్య ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. ఆమ్మాయి తరపు పెద్దలు అందుకు అంగీకరించలేదు. కావ్య కూడా పెద్దల మాటకు తవంచడంతో సురేష్ ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నాడు. సోమవారం తాటిపర్తి గ్రామానికి వెళ్లిన సురేష్.. కావ్యను గన్ తో షూట్ చేశాడు. అనంతరం తాను కూడా పాయింట్ బ్లాంక్ లో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కావ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.
స్థానికులిచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అసలు సురేష్ రెడ్డి వద్దకు గన్ ఎలా వచ్చింది..? ఎవరు ఇచ్చారు..? లైసెన్స్ తుపాకీనా కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
గత ఏడాది గుంటూరులో ఇలాంటి ఘటనే జరిగింది. బీటెక్ చదువుతున్న రమ్యకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన శశికృష్ణ అనే యువకుడు.. ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. అతని వేధింపులు భరించలేక రమ్య.. శశికృష్ణ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసింది. ఇది జీర్ణించుకోలేని శశికృష్ణ కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28మందిని విచారించగా.., ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి.. ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. సుమారు 9నెలల విచారణ చేసిన ప్రత్యేక న్యాయస్థానం గత నెల 29న శుక్రవారం తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.