Love Affair: పెళ్లికి ముందే ప్రియుడితో యువతి సహజీవనం... ఏం జరిగిందో ఏమో.. శవమై తేలింది..

ప్రతీకాత్మకచిత్రం

Living Together త్వరలోనే పెళ్లి చేసుకంటున్నాం కదా అని ఇద్దరూ కలిసి రూమ్ తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఐతే ఉన్నట్లుండి అమ్మాయి... ప్రియుడులేని సమయంలో గుర్తుతెలియని ఇంజెక్షన్ తీసుకుంది.

 • Share this:
  ప్రేమ. యువతీ యువకులను ఎక్కడివరకైనా తీసుకెళ్తుంది. ఒకరినొకరు ఇష్టపడిన వారు మూడుముళ్ల ద్వారా ఒక్కటవుతారు. ఈ విషయంలో కొందరు సక్సెస్ అవుతారు.. మరికొందరు విఫలమవుతంటారు. ఐతే తమ ప్రేమను ఎలాగైనా గెలిపంచుకోవాలని తపించిన ఓ జంట.. పెళ్లికి ముందే సహజీవనం చేసింది. ఆ బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే అనుమాన బీజం పడింది. ఇంకేముంది ఇద్దరి మధ్య గొడవలు, వాగ్వాదాలు. ఇంతలో ఏం జరిగిందో ఏమో... ప్రియుడితో కలిసి ఉంటున్న ఇంట్లోనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన అంటోనీ గీత అనే యువతి.. కడప నగరంలోని నాగరాజుపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో అనిల్ కుమార్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. వీళ్లిద్దరూ గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని భావించారు.

  ఐతే ఇద్దరి ఇళ్లలో పెళ్లికావాల్సిన పెద్దవాళ్లుండటంతో కొన్నాళ్లు ఆగుదామని భావించారు. ఇదిలా ఉంటే ఇద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేస్తుండటంతో అనిల్ కుమార్ రిమ్స్ పోలిస్ స్టేషన్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇద్దరూ ఆ ఇంట్లోనే సహజీవనం చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అనిల్ కు గీతపై అనుమానం వచ్చింది. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనను మోసం చేస్తున్నావని.. చచ్చిపో అంటూ గీతను టార్చర్ చేశాడు.

  ఇది చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త అడ్డుగా ఉన్నాడని మేనల్లుడితో కలిసి మర్డర్ స్కెచ్..


  అనిల్ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన గీత.. అతడు ఇంట్లోలేని సమయంలో ఇంటిపైకి వెళ్లి ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. గీత తల్లి మల్లిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని అనిల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ కుమార్తె మృతికి కారకుడైన అనిల్ ను కఠినంగా శిక్షించాలని గీత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పెళ్లికావాల్సిన కూతురు దూరమవడంతో ఆమె తల్లి మల్లిక విషాదంలో మునిగిపోయింది.

  ఇది చదవండి: ఆస్తిలో వాటా అడిగిన కొడుకు.. ఆ తండ్రి అంత పనిచేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు..!


  ఇలాంటి ఘటనో ఇటీవల అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పాణ్యంకు చెందిన ఈరమ్మ.. తన భర్త నేరం చేసి జైలుకు వెళ్లడంతో శ్రీరాములు అనే వ్యక్తికి దగ్గరైంది. అతడికి భార్య లేకపోవడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఐతే ఈరమ్మపై అనుమానం పెంచుకున్న శ్రీరాములు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈరమ్మపై కక్షతో ఆమెను చంపాలని ప్లాన్ వేసిన శ్రీరాములు... తేనే కోసం వెళ్దామంటూ ఆమెను అడవిలోకి తీసుకెళ్లి కట్టెతో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీరాములును అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
  Published by:Purna Chandra
  First published: