TIRUPATI YOUNG WOMAN COMMITS SUICIDE AFTER CONSTABLE CHEATED HER ON THE NAME OF LOVE FULL DETAILS HERE PRN TPT
Love Cheating: ప్రేమించానంటే మురిసిపోయింది.. అతడి నిజస్వరూపం తెలిసి తట్టుకోలేకపోయింది..
ప్రసాద్, ఉమామహేశ్వరి (ఫైల్)
ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) శ్రీకాళహస్తి పట్టణంలోని 9వ వార్డులో ఉమామహేశ్వరి అనే యువతి వార్డు వాలంటీర్ గా పనిచేస్తోంది. కొంతకాలం క్రితం పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా (Love) మారింది.
ప్రేమ, పెళ్లి.. ఇవన్నీ నమ్మకం అనే పునాదులపై నిలబడతాయి. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు.. అది లేని పెళ్లి నిలవదు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకొని భార్యపిల్లలు ఉండగానే వేరే మహిళతో సంబంధాలు నెరిపే భర్తలు చాలా మందే ఉన్నారు. ఐతే నలుగురికి మంచి చెప్పాల్సిన పోలీస్ కానిస్టేబుల్ దారితప్పాడు. భార్య ఉండగానే మరో యువతితో ప్రేమాయం సాగించాడు. ఆమెకు నిజం తెలియడంతో అబద్ధాలతో కాలం వెళ్లిదీశాడు. ఆ తర్వాత ఆమెను దూరం పెట్టి మరో యువతితో లవ్ ట్రాక్ నడిపాడు. మోసగాడి చేతిలో నయవంచనకు గురైన యువతి చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) శ్రీకాళహస్తి పట్టణంలోని 9వ వార్డులో ఉమామహేశ్వరి అనే యువతి వార్డు వాలంటీర్ గా పనిచేస్తోంది. కొంతకాలం క్రితం పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది.
ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏడాదిగా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. గిఫ్టులతో బలపడిన బంధం.. శారీరకంగా కలిసేవరకు వెళ్లింది. ఇంతలోనే ఆమెకు షాకింగ్ నిజం తెలిసింది. ప్రసాద్ కు అప్పటికే పెళ్లైనట్లు తెలుసుకున్న మహేశ్వరి అతడ్ని నిలదీసింది. ఐతే తనకు భార్య అంటే ఇష్టం లేదని.. నిన్నే పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమెను కూడా దూరం పెట్టి మరో యువతిని లైన్లో పెట్టాడు.
ప్రియుడి చేతిలో దారుణంగా మోసపోవడంతో మనస్తాపం చెందిన ఉమామహేశ్వరి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కానిస్టేబుల్ ప్రసాద్ ప్రేమ పేరుతో మోసం చేసి తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడని ఉమామహేశ్వరి తల్లి ఆరోపించింది. ఉన్నతాధికారులు ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా సంగంకు చెందిన ఎస్సై నాగార్జున భార్యను దారణంగా మోసం చేశాడు. రెండేళ్ల క్రితం లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగార్జున.. ఎస్సై ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. భార్యను చిత్రహింసలు పెట్టడమే కాకుండా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో కేసు నడుస్తుండగానే మరో యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కోర్టుకు వాయిదా కోసం వచ్చిన భార్యపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. భర్త అంతదారుణంగా కొట్టినా లావణ్య మాత్రం అతడితోనే కాపురం చేస్తానని చెబుతోంది. పోలీస్ ఉద్యోగం వచ్చినంత మాత్రాన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వేధించడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.