హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati: ప్రేమపెళ్లి చేసుకున్నందుకు రూ.50వేల జరిమానా..? చెల్లించకపోయే సరికి ఎంతదారుణానికి ఒడిగట్టారో..!

Tirupati: ప్రేమపెళ్లి చేసుకున్నందుకు రూ.50వేల జరిమానా..? చెల్లించకపోయే సరికి ఎంతదారుణానికి ఒడిగట్టారో..!

శ్రీహరి, లీలావతి దంపతులు (ఫైల్)

శ్రీహరి, లీలావతి దంపతులు (ఫైల్)

మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. కులాలు, మతాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటున్న సమాజం ఇది. మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్నా.. ఇంకా కులం కట్టుబాట్లు అంటూ పట్టుకొని వేలాడుతున్న గ్రామాలు చాలానే ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

GT Hemanth Kumar, News18, Tirupati

మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. కులాలు, మతాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటున్న సమాజం ఇది. మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్నా.. ఇంకా కులం కట్టుబాట్లు అంటూ పట్టుకొని వేలాడుతున్న గ్రామాలు చాలానే ఉన్నాయి. ఆధునిక యుగంలోనూ కులమతాలు అనే కక్ష్యలు పెట్టుకొని సాటి మనిషిపై క్రూరంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. అంతేకాదు పెద్దరికం పేరుతో అమానుషాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నచ్చినవాడిని పెళ్లాడే స్వేచ్ఛ అమ్మాయిలకు లేకుండా పోయింది. అలా ప్రేమించిన వాడిని పెళ్లిచేసుకున్న ఓ యువతిపట్ల పెద్దలు కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారు. ప్రేమ పెళ్లికి జరిమానా విధించి అది కట్టకపోవడంతో మృగాల్లా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్ళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati District) ఏర్పేడు మండలం, పాత వీరాపురం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన లీలావతి అనే యువతి ఎనిమిది నెలల క్రితం కడప జిల్లాకు చెందిన శ్రీహరి అనే యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

ప్రియుడ్ని పెళ్లాటిన నాటి నుంచి అత్తారింటిలోనే ఉంటున్న లీలావతిని ఇటీవల పుట్టింటివారు ఇంటికి పిలిచారు. దీంతో ఈనెల 14న భర్తతో కలిసి స్వగ్రామమైన వీరాపురం గ్రామానికి వెళ్లింది. అక్కడివరకు అంతా బాగానే ఉంది. ఐతే లీలావతి పుట్టింటికి వచ్చినట్లు తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అక్కడికి వచ్చారు. అందరూ వచ్చి ఇంటిని చుట్టుముట్టారు. కొద్దిసేపటి తర్వాత అసలు పంచాయతీ మొదలుపెట్టారు.

ఇది చదవండి: కలియుగ వైకుంఠంలో శ్రీవారి మరో అవతారం.., కనుమరుగైన స్వామివారి వారి రూపం.. వివరాలివే..!

గ్రామ కట్టుబాటు ప్రకారం ప్రేమ వివాహం.. అందునా కులాంతర వివాహం చేసుకున్నవారికి జరిమాన విధించడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుందంటూ లీలావతి భర్త శ్రీహరికి వివరించారు. తమ గ్రామ కట్టుబాటును అతిక్రమించి ప్రేమ వివాహం చేసుకున్న లీలావతికి 50 వేల రూపాయలు జరిమాన విధించారు. జరిమానా చెల్లించేందుకు కొంత సమయం కావాలని లీలావతి కుటుంబ సభ్యులు గ్రామస్తులను వేడుకున్నారు. దీంతో రెండు రోజుల పాటు గడువు ఇచ్చారు. అయితే నగదు సమయానికి దొరక్క పోవడంతో మరికొద్ది రోజులు గడువు అడిగారు.

దీంతో లీలావతిపై ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు ఆమెపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో‌ పడి ఉన్న లీలావతిని కుటుంబ సభ్యులు తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఐతే దెబ్బలు బలంగా తగలడంతో ఆమెకు గర్భస్రావమైనట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Love marriage, Tirupati

ఉత్తమ కథలు