• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TIRUPATI YOUNG MEN GANG BOOKED FOR ATTACKING ON MINOR BOY FOR MAKING PHONE CALLS TO HIS SISTER IN MADANAPALLI OF CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Andhra Pradesh: బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్న చెల్లి.. అది చూసిన అన్న ఏం చేశాడంటే...

Andhra Pradesh: బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్న చెల్లి.. అది చూసిన అన్న ఏం చేశాడంటే...

ఫ్రతీకాత్మక చిత్రం

చెల్లెలు నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటాన్ని భరించలేని ఓ అన్న షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ యువకుడ్ని లాడ్జికి పిలిపించి...

  • Share this:
    అన్నకు చెల్లెలిపై ప్రేమ ఉండటం కామన్.. కానీ ఆ ప్రేమ హద్దులు మీరకూడదు. చెల్లెలు ఏదైనా తప్పు చేసింది అనిపిస్తే పిలిచి నచ్చజెప్పాలి. లేదంటే మందలించాలి లేదా తల్లదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారితో భయం చెప్పించాలి. కానీ తన చెల్లెలు ఓ అబ్బాయితో నిత్యం ఫోన్లో మాట్లాడుతుందని తెలుసుకున్న అన్న.. చెల్లెలికి భయం చెప్పకుండా.. ఆ అబ్బాయిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. అంతేకాదు అతని ఫ్రెండ్స్ తో కలిసి దాడి చేయించాడు. మైనర్ బాలుడు అని కూడా చూడకుండా దారుణంగా కొట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన ఓ యువతి.. నిత్యం ఫోన్లో మాట్లాడుతోంది. అనుమానం వచ్చిన ఆమె అన్న ఆరా తీయగా.. నిమ్మపల్లె రోడ్డుకు చెందిన మైనర్ బాలుడితో మాట్లాడుతున్నట్లు తేలింది. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న యువతి అన్న..ఆ బాలుడ్ని మాట్లాడలని రవి రుచులు లాడ్జ్ వద్దకు పిలిపించాడు.

    అదే లాడ్జిలో రూమ్ బుక్ చేసి బాలుడ్ని తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలుడు క్షమించి వదిలేయాలని ఎంత ప్రాధేయపడినా కనికరించని యువతి అన్న, అతడి స్నేహితులు కాళ్లతో తన్నుతూ ఆ దాడి ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై బాలుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మదనపల్లి టూ టౌన్ ఎస్సై దాడికి పాల్పిడిన వారిపై కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా బాలుడిపై దాడిన చేసిన వారిని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

    ఇది చదవండి: ఫ్రెండ్ తో కలిసి బీచ్ కు వెళ్లిన యువతి... కానీ అలా జరుగుతుందని ఆమె ఊహించి ఉండదు...


    ఐతే యువతికి బాలుడికి మధ్య సంబంధమేంటనేది మాత్రం తెలియలేదు. ఫోన్ కాల్ విషయంపై పోలీసులు యువతిని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఐతే మైనర్ బాలుడిపై ఇంతదారుణంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని గానీ ఇలా దాడి చేయడం సరికాదని.. ఒకవేళ బాలుడి ప్రాణాలు పోయి ఉంటే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చెల్లెలికి నచ్చజెప్పలేని అన్న.. ఏ సంబంధంలేని బాలుడిపై దాడి చేయడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.

    ఇది చదవండి: మహిళా ఎస్సై ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు… అంతా సీఐనే చేశాడా..?

    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు