TIRUPATI YOUNG MEN BOOKED FOR MISBEHAVING WITH GIRLS ON THE NAME OF YOUTUBE PRANK VIDEOS IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
చిత్తూరు జిల్లాలో ప్రాంక్ పేరుతో వేధిస్తున్న యువకుల అరెస్ట్
ఆధునిక టెక్నాలజీ అందుబాటులో వచ్చిన నాటి నుంచి మంచి మార్గానికంటే చెడు మార్గాలకే ఎక్కువగా ఉంపయోగిస్తుంటారు. ఇన్ స్టాగ్రామ్ (Instagram), యూట్యూబ్ (YouTube), ఫేస్ బుక్ (Face Book) లలో తమ టాలెంట్ తో మంచి డాన్సులు, యాక్టింగ్ వీడియోలు పోస్ట్ చేసినా.. చిత్రవిచిత్రమైన వీడియోలు అప్ లోడ్ చేసినా.. ప్రాంక్ వీడియోలు పెట్టినా.. జనానికి నచ్చితే లక్షల్లో వ్యూస్ వస్తాయి.
ఆధునిక టెక్నాలజీ అందుబాటులో వచ్చిన నాటి నుంచి మంచి మార్గానికంటే చెడు మార్గాలకే ఎక్కువగా ఉంపయోగిస్తుంటారు. ఇన్ స్టాగ్రామ్ (Instagram), యూట్యూబ్ (YouTube), ఫేస్ బుక్ (Face Book) లలో తమ టాలెంట్ తో మంచి డాన్సులు, యాక్టింగ్ వీడియోలు పోస్ట్ చేసినా.. చిత్రవిచిత్రమైన వీడియోలు అప్ లోడ్ చేసినా.. ప్రాంక్ వీడియోలు పెట్టినా.. జనానికి నచ్చితే లక్షల్లో వ్యూస్ వస్తాయి. అందుకు తగ్గట్లుగానే ఆదాయం కూడా వచ్చిపడుతుంది. ఈ క్రమంలో కొందరు తమ టాలెంట్ చూపిస్తూ సెలెబ్రిటీలు అవుతుంటే.. మరికొందరు ప్రాంక్ ప్రాంక్ వీడియోస్ పేరుతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్నారు. శృతి మించనంతవరకు ఏం పర్లేదు అనుకున్నా.. శృతి మించి బోల్డ్ ప్రాంక్స్ చేస్తూ వాటిపై డబ్బులు ఆర్జిస్తున్నారు. ఇలాంటివన్నీ పెద్దపెద్ద సిటీల్లో జరిగే తంతు.
కానీ చిన్న చిన్న టౌన్ లలో కూడా ఈ ప్రాంక్ వీడియోస్ ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి. ప్రాంక్ వీడియోలు చేస్తే ఓవర్ నైట్ సెలెబ్రిటీలు అవుతామని కలలు కంటున్నారు యువత. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తూరు జిల్లా (Chittoor District) లో కొందరు ఆకతాయిలు చేసిన ప్రాంక్.. వారిని కటకటాల పాలు చేసింది. మిక్కీ మౌస్, టెడ్డి బేర్ వేషధారణలో వచ్చి ప్రాంక్ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసున్నారు.
వివరాల్లోకి వెళితే.. పలమనేరులోని గుడియాత్తం రోడ్డులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు ఈ రోడ్డంతా జనజాతరను తలపిస్తుంది. ఎటు చూసినా విద్యార్థులు వారి తల్లితండ్రులు, మహిళలు అధికంగా ఆ ప్రాంతంలో తిరుగుతుంటారు. స్కూల్స్, కళాశాలలు నుంచి విద్యార్థులు ఇంటికి వెళ్ళే సమయంలో ఇద్దరు వ్యక్తులు టెడ్డీ బేర్, మిక్కీ మౌస్ వేషధారణలో గుడియాత్తం రోడ్డుకి వచ్చారు. అప్పుడే స్కూల్స్, కాలేజీల నుంచి బయటకు వస్తున్న విద్యార్థినులతో ప్రాంక్ చేయడం మొదలెట్టారు. వారిని భయపెట్టడం., అసభ్యకరంగా ప్రవర్తించి ఒంటిపై చేతులు వేయడం., సైగలు చేయడం., వారి అనుమతి లేకుండా సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేశారు.
ఇక పెళ్ళైన ఆడవారిపై కూడా ఇలానే ప్రవర్తించే వారు. ప్రాంక్ తో ఒక్కసారిగా మహిళలు, విద్యార్థినులు భయపడ్డారు. వీళ్లు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు అడిగేలోపు ప్రాంక్ అంటూ సమాధానం ఇచ్చి వెళ్లిపోయే వారు. దీన్ని గుర్తించిన కొందరు పలమనేరు పోలీసులకు పిర్యాదు చేశారు. రంగంలోకి పోలీసులు ప్రాంక్ వీడియో పేరుతో అసభ్యంగా ప్రవర్తించిన కరీముల్లాపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి సహకరించిన మరికొందరిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలు, విద్యార్థినులకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆలాంటివాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని పోలీసులు హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.