Home /News /andhra-pradesh /

TIRUPATI YOUNG MAN SUSPECT DEATH AFTER HAVING EXTRAMARITAL AFFAIR WITH MARRIED WOMAN IN SRIKAKULAM DISTRICT FULL DETAILS HERE PRN TPT

Affair: పెళ్లైన మహిళతో యువకుడి ఎఫైర్.. ఆమె కోసం ఏడు జిల్లాలు దాటి వెళ్లాడు.. కానీ..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Affair: పచ్చని కాపురాల్లో నిప్పులు చెలరేగేలా చేస్తున్నాయి అక్రమ సంబంధాలు. తనను భర్త పట్టించుకోవడం లేదని భార్య.. ఎంతచేసినా భార్య గుర్తించడం లేదన్న కోపంతో భర్త.. మూడు ముళ్ల బంధాన్ని ఎగతాళి చేస్తున్నారు. అలాంటి బంధాన్ని సాగించిన ఓ మహిళ.. యువకుడి చావుకు కారణమైంది.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, Tirupathi, News18

    పచ్చని కాపురాల్లో నిప్పులు చెలరేగేలా చేస్తున్నాయి అక్రమ సంబంధాలు. తనను భర్త పట్టించుకోవడం లేదని భార్య.. ఎంతచేసినా భార్య గుర్తించడం లేదన్న కోపంతో భర్త.. మూడు ముళ్ల బంధాన్ని ఎగతాళి చేస్తున్నారు. అందమైన జీవితాన్ని తాత్కాలిక ఆకర్షణలకు లోనై బలి చేసుకుంటున్నారు. పెళ్లై భర్త, పిల్లలతో ఉంటున్న మహిళతో అక్రమ సంబంధం (Extramarital Affair) పెట్టుకున్న యువకుడు చివరకు ఆ బంధానికే బలయ్యాడు. ఆకర్షణకు లోనే ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామ పరిధిలోని పల్లెపాలెంకు చెందిన నరేంద్ర కుమార్.. బెంగళూరులో ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడు స్వగ్రామంలోనే ఉంటున్నాడు. నరేంద్రకు.. శ్రీకాకుళం జిల్లా లావేరు నుంచి వలస వచ్చి చేపల చెరువుల వద్ద కాపలా ఉంటున్న భార్యాభర్తలతో పరిచయమైంది.

    మహిళతో నరేంద్రకు ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న భర్త.. భార్యకు నచ్చజెప్పాడు. అయినా వినకపోవడంతో నరేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దర్నీ పిలింపిచన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నరేంద్ర కుటుంబ సభ్యులతో రాజీ చేసి పంపేశారు. ఆ తర్వాత భార్యభర్తలు స్వగ్రామం వెళ్లిపోయారు. ఐతే మహిళతో ఏర్పడిన బంధాన్ని మర్చిపోలేకపోయిన నరేంద్ర.., ఆమె కోసం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామానికి వెళ్లాడు.

    ఇది చదవండి: ఏపీలో నైట్ కర్ఫ్యూ విధింపు.. కొత్త టైమింగ్స్, రూల్స్ ఇవే..!


    ఐతే మహిళ భర్త మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నరేంద్రకు కౌన్సెలింగ్ ఇచారు. ఐతే ఆ తర్వాత మహిళ భర్తకు, నరేంద్రకు మధ్య ఘర్షణ జరిగింది. ఐతే ఈ రోజు మాయమైన నరేంద్ర.. సమీపంలోని బావిలో శవమై తేలాడు. అతడి మొబైల్ ఫోన్ ఆధారంగా నెల్లూరులో ఉన్న కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనేదానిపై విచారణ సాగిస్తున్నారు. నరేంద్ర కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమారుడ్ని చంపేశారని ఆరోపిస్తున్నారు.

    ఇది చదవండి: ‘నన్ను రేప్ చేసి చంపేస్తారు..’ మహిళా పోలీస్ సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు..


    ఇలాంటి ఘటనే ఇటీవల విశాఖపట్నంలో చోటు చేసుకుంది. అఖిలేష్ అనే యువకుడు.. పెళ్లైన మహిళతో సహజీవనం చేస్తుండగా.. ఆమెకు స్నేహితురాలైన మరో వివాహితతోనూ ఎఫైర్ పెట్టుకున్నాడు. కొన్ని రోజులకు ఆమెను తీసుకెళ్లి విశాఖ జిల్లా పద్మనాభంలో కాపురం పెట్టాడు. దీనిపై సదరు మహిళ బావ, అతడి స్నేహితులు అభ్యంతరం తెలిపారు. అయినా ఇద్దరిలో మార్పు రాకపోవడంతో అఖిలేష్ ను హత్య చేసి పరారయ్యారు. మృతుడి తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో దర్యాప్తు సాగించిన పోలీసులు ఆరు నెలల తర్వాత కేసును ఛేదించారు. విషయం బయటకురాకుండా ఉండేందుకు అఖిలేష్ డెడ్ బాడీకి కారం, అల్లంపేస్ట్ రాసినట్లు విచారణలో నిందితులు తెలిపారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Nellore Dist, Srikakulam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు