హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Girl Child: చిన్నపిల్లల్ని ఆడిస్తుంటే మంచోడనుకున్నారు... వీడిలో మరో మృగాడున్నాడు..

Girl Child: చిన్నపిల్లల్ని ఆడిస్తుంటే మంచోడనుకున్నారు... వీడిలో మరో మృగాడున్నాడు..

నిందితుడు అనిల్ కుమార్

నిందితుడు అనిల్ కుమార్

Child Rape: ఆడుకుందామంటూ అభం శుభం తెలియని చిన్నారులను ఇంటి మిద్దెపైకి తీసుకెళ్తుండేవాడు. స్థానికులు కూడా పిల్లల్ని ఆడించేందుకు మిద్దెపైకి తీసుకెళ్తుండేవాడని భావించేవారు.

  GT Hemant Kumar, Tirupati, News18

  మహిళలు., చిన్నారుల రక్షణకోసం ఎన్నో చట్టాలు తీసుకొస్తున్న ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. గుంట నక్కలు జింక పిల్లను చీల్చుకు తిన్నట్లు మానవ మృగాలు... అభం శుభం ఎరుగని చిన్నారులపై కామం అనే పంజా విసిరి ఛిదిమేస్తున్నారు. దేశంలో నిర్భయ (Nirbhaya Act)., రాష్ట్రంలో దిశ (Disha) లాంటి చట్టాలు అమలులో ఉన్న కీచకుపర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో చిన్నారి జీవితాన్ని చిదిమేసిన ఘటన మరువకముందే.. కామంతో కళ్ళు మూసుకుపోయి చిన్నారులను వేధిస్తున్న ఓ మృగాడి ఉందంతం ఆంద్రప్రదేశ్ (Andhra  Pradesh) లో వెలుగు చూసింది. చిన్నారులను పంపాలంటేనే తల్లిగండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటువైపు నుంచి ఏ మానవ మృగం దాడిచేస్తుందోనని పిల్లల్ని గాజుబొమ్మల్లా కాపాడుకోవాల్సి వస్తోంది.

  వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా (Chittoor District) తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో అనిల్ (20)అనే యువకుడు నిత్యం చిన్నపిల్లలతో ఆడుతుంటేవాడు. కాలనీలోనే తిరుగుతూ... ఆడపిల్లలున్న చోటే ఉండిపోయేవాడు. ఆడిస్తానంటూ అభం శుభం తెలియని చిన్నారులను ఇంటి మిద్దెపైకి తీసుకెళ్తుండేవాడు. స్థానికులు కూడా పిల్లల్ని ఆడించేందుకు మిద్దెపైకి తీసుకెళ్తుండేవాడని భావించేవారు. కానీ వాడు ఆట ముసుగులో చిన్నారులపై కీచకపర్వాన్ని సాగించేవాడు. మిద్దెపైకి తీసుకెళ్లి అభంశుభం తెలియని చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడుతుండేవాడు.

  ఇది చదవండి: మోసాల్లో ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’... వీళ్లను నమ్మితే దిమ్మతిరిగి బొమ్మ కనబడుద్ది..!


  ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రోడ్డుపై ఇద్దరు బాలికలు ఆడుకుంటూ ఉండగా అక్కడకు వచ్చిన అనిల్ వారిని మేడపైకి తీసుకెళ్లాడు. ఒక బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వివస్త్రను చేయాలనీ చూశాడు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక గట్టిగా కేకలు వేసింది. కంగారుగా మేడపైకి వెళ్లిన స్థానికులకు అనిల్ చేస్తున్న అకృత్యం కంటపడింది. వెంటనే అతడ్ని పట్టుకొని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పాప తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు నిందితుడు అనిల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు.

  ఇది చదవండి: అసలు వీడు మొగుడేనా..? బలిచ్చేందుకు పిల్లల్ని కనాలంట... భార్యతో క్షుద్రపూజలు


  ఇటీవల కర్నూలు జిల్లాలో ఇలాంటి మృగాడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గోస్పాడు మండలం కామినేని పల్లెలో నివాసముంటే లక్క అనిల్ కుమార్ అనే యువకుడు తన ఇంటి సమీపంలో నిసావముంటున్న బాలికను చాక్లెట్ ఇస్తాను రమ్మంటూ ఇంటికి తీసుకెళ్లాడు. అది నమ్మిన బాలిక అనిల్ తో పాటు అతడి ఇంటికెళ్లింది. ఆ చిన్నారి అడిగినవన్నీ ఇస్తూనే ఆమె ఒంటిపై మెల్లగా చేతులు వేశాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంటికెళ్లి బిగ్గరగా ఏడవడంతో ఏమైందని తల్లితండ్రులు అరా తీశారు. దీంతో జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పింది. ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడని చెప్పింది. దీంతో ఆ చిన్నారి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు అనిల్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Crime news, Rape attempt

  ఉత్తమ కథలు