హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati News: సోషల్ మీడియాలో మహిళల ఫోటో చూసి చాటింగ్ చేస్తున్నారా..! ఇదిగో ఈ వార్త మీకోసమే..!

Tirupati News: సోషల్ మీడియాలో మహిళల ఫోటో చూసి చాటింగ్ చేస్తున్నారా..! ఇదిగో ఈ వార్త మీకోసమే..!

పోలీసుల అదుపులో నిందితుడు అనిల్

పోలీసుల అదుపులో నిందితుడు అనిల్

సోషల్ మీడియా (Social Media).. ఈ రోజుల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారిని సైతం స్నేహం పేరుతో దగ్గర చేస్తోంది. కానీ అదే సోషల్ మీడియా కొందరి జీవితాలను నాశనం చేస్తోంది. మరికొందరితో నీచమైన పనులు చేయిస్తోంది.

GT Hemanth Kumar, News18, Tirupati

సోషల్ మీడియా (Social Media).. ఈ రోజుల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారిని సైతం స్నేహం పేరుతో దగ్గర చేస్తోంది. కానీ అదే సోషల్ మీడియా కొందరి జీవితాలను నాశనం చేస్తోంది. మరికొందరితో నీచమైన పనులు చేయిస్తోంది. తాను పనిచేసే చోట యువతులపై కన్నేసిన ఓ ప్రబుద్ధుడు.. ఫేస్ బుక్ చాటింగ్ పేరుతో వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించాడు. పైత్యం ముదరడంతో ఊచలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) తవణంపల్లె మండలం దిగువమారేడిపల్లేకు చెందిన అనిల్ అనే యువకుడు.. తిరుపతి (Tirupati) లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. చదువు అబ్బకపోవడంతో దారితప్పాడు. డిగ్రీ ఫెయిలై నాలుగు సబ్జెక్టులు వెనకేసుకున్నాడు. చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేసి చివరకు ఓ ప్రైవేట్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. తనతో పాటు పనిచేస్తున్న యువతులపై మనోడి కన్నుపడింది.

ఇంకేముంది వారిని పటాయించడం మొదలుపెట్టాడు. వీడి సంగతి పసిగట్టిన యువతులు అనిల్ ను దూరం పెట్టారు. యువతులతో వర్కౌట్ కాదనుకున్నాడో ఏమో.. పెళ్లైన వారిపై కన్నేశాడు. తనతో పనిచేయే వివాహితను పరిచయం చేసుకొని తన కోరిక తీర్చుకునేందుకు యత్నించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోగా అనిల్ ను పట్టించుకోవడం మానేసింది. దీంతో ఆమెపై కక్షగట్టిన అనిల్.. ఓ పనికిమాలిన ఐడియా వేశాడు. ఆమెపేరుతో ఓ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేసి.. ఆమెకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్ లిస్టులోని వారందరికీ రిక్వెస్టులు పెట్టాడు. తాను ఓ మహిళగా వారిని పరిచయం చేసుకున్నాడు. వారితో చాటింగ్ చేస్తూ వారిని పూర్తిగా నమ్మించాడు.

ఇది చదవండి: ప్రేమించిన భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. కట్ చేస్తే ఓ రాత్రి షాకింగ్ సీన్..


ఆ తర్వాత వాడిలోని కామపిశాచిని బయటపెట్టాడు. వారికి అసభ్యకర మెసేజ్ లు పంపుతూ.. అశ్లీల ఫోటోలు పంపేవాడు. అంతేకాదు వారి ఫోటోలను డౌన్ లోడ్ చేసుకొని లోబరుచుకోవాలని ప్లాన్ వేశాడు. వాడి కన్నింగ్ ప్లాన్ గమనించిన ఓ వివాహిత ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ తో స్పందించిన పోలీసులు.. ఫేస్ బుక్ ఐడీ ఆధారంగా దర్యాప్తు చేశారు. చివరకు అనిల్.. అమ్మాయి పేరుతో ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేసి ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారు.

ఇది చదవండి: ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఆమె పాలిట శాపమైంది.. మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్..


మహిళపేరుతో ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేసి వారిని ట్రాప్ చేస్తున్నట్లు తేల్చారు. పక్కా సమాచారంతో అతడ్ని దిగువమారేడుపల్లిలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అపరిచ వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తే మహిళలు అప్రమత్తంగా ఉండాలని.. అలాంటి వారిని నమ్మి జీవితాలు ప్రమాదంలో పడేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Tirupati

ఉత్తమ కథలు