ఇంటర్నెట్ (Internet), సోషల్ మీడియా (Social Media) వచ్చిన తర్వాత ఏ పనైనా ఆన్ లైన్ లో చూసి నేర్చుకునే అవకాశం కలిగింది. కోచింగులు, ట్రైనింగ్ సెంటర్లతో పనిలేకుండా యూట్యూబ్ (YouTube) లో చూసి విభిన్న రకాల నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. మొక్కల పెంపకం, టైలరింగ్, ఇంటి చిట్కాలు, కొన్ని బిజినెస్ ఐడియాలు, ఉపాధి మార్గాలు యూట్యూబ్ లో అందుబాటులో ఉంటున్నాయి. ఐతే యూట్యూబ్ లో కొందరు కేటుగాళ్లు తప్పుడు పనులు నేర్చుకుంటున్నారు. ఇటీవల దొంగనోట్ల ముఠాకు కూడా యూట్యూబే గురువు. తాజాగా అప్పులపాలైన ఓ యువకుడు యూట్యూబ్ చేసి నేర్చుకున్న బిజినెస్ ఐడియా అతడ్ని కటకటాల పాలుచేసింది. ఇంతకీ అతడు నేర్చుకున్న విద్య, ఆ టాలెంట్, ఆ బిజినెస్ ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా..? మనోడు నేర్చుకున్నది నాటు బాంబుల తయారీ.. చేస్తున్న సైడ్ బిజినెస్ బాంబుల సేల్స్.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) పుట్లూరు మండలంలో ఫ్యాక్షన్ గ్రామంగా ముద్రపడిన మడుగుపల్లి గ్రామానికి చెందిన యాపర్ల నరేష్ కుమార్ రెడ్డి నాటు బాంబులు తయారు చేసుకుని అమ్మడానికి వెళ్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అతడ్ని మడుగుపల్లి- నార్పలకు వెళ్లేదారిలో అదుపులోకి తీసుకున్నారు. సంచిలో తీసుకెళ్తున్న బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతడ్ని విచారించగా.. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఇలా చేసినట్లు వివరించారు.
ఇది చదవండి: తుఫాన్ విరుచుకుపడి ఏడాదైంది..! ఇంకా ఆ గ్రామాలను వీడని భయం..
జిల్లాలోని కొన్ని ఫ్యాక్షన్ గ్రామాలకు వెళ్లి బాంబులను విక్రయించి సొమ్ము చేసుకుందామని భావించినట్లు సురేష్ కుమార్ రెడ్డి వివరించాడు. యూట్యూబ్ లో బాంబుల తయారీకి కావాల్సిన పదార్ధాలను తెలుసుకొని.. సంబంధిత వీడియోల్లోనే బాంబుల తయారీని నేర్చుకున్నట్లు చెప్పాడు. ఐతే సురేష్ కుమార్ వద్ద బాంబులు కొనేందుకు ఎవరైనా సంప్రదించారా..? ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నాడు..? ఇదంతా ఒక్కడే చేశాడా..? లేక మరెవరికైనా హస్తముందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
దొంగనోట్లు కూడా…
ఇటీవల గుంతకల్లు మండలం కసాపురంకు చెందిన షేక్ నూర్ బాషా, ఖాజా, ఖీసీం అనే వ్యక్తులు దొంగనోట్లు చలామణి చేయబోతూ దొరికిపోయారు. వీళ్ల గురువు కూడా యూట్యూబే. ఈ ముగ్గురు భారీగా అప్పులు చేశారు. ఆదాయం లేకపోవడం అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఈజీ మనీ సంపాదించాలని స్కెచ్ వేశారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో యూట్యూబ్ లో డబ్బులు ఎలా సంపాదించాలని వెతికారు. వెతుకుతుండగానే దొంగనోట్ల తయారీ ఐడియా వచ్చింది. అంతే “How to create Currency” అనే కీ వర్డ్ తో సెర్చ్ చేశారు.
ఇది చదవండి: వర్ధన్ బ్యాంక్ స్కామ్ లో సంచలన నిజాలు.., రాజకీయ హస్తం నిజమేనా..?
అందులోని సమాచారం అధారంగా నకిలీ నోట్ల తయారీకి కావాల్సిన వస్తువులు, పరికరాలను కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అన్నీ సమకూర్చుకున్నారు. అంతా సిద్ధం చేసుకొని నోట్ల ముద్రణ మొదలుపెట్టారు. ఇలా రూ.100 నోట్లు ముద్రించి మార్కెట్లో మార్పిడి చేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో నూర్ బాషా జొన్నగిరి గ్రామం వెళ్లి నకిలీ నోటుతో చికెన్ కొనడానికి యత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Crime news, Youtube