TIRUPATI YOUNG MAN ARRESTED FOR CHEATING PEOPLE ON THE NAME OF RENTAL CARS IN CHITTOOR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Tirupati News: ఈ తెలివి చదువులో చూపించుంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యేవాడు.. మరిప్పుడేమయ్యాడో చూడండి..!
పోలీసుల అదుపులో మహేశ్వర్ రెడ్డి
Cheating: జీవితంలో డబ్బు సంపాదనకు ఎన్నో మార్గలు ఉన్నాయి. ఒక్కో మార్గంలో విజ్ఞలను అధిగమించి విజయ సోపానంకు మార్గాన్ని వేసుకోవాలి. కష్టాలు వచ్చాయని ఈజీ మనీ ఎర్నింగ్ అంటే సులువైన మార్గంలో నగదు జమ చేసుకోవాలంటే కటకటాల పాలు కాకతప్పదు.
జీవితంలో డబ్బు సంపాదనకు ఎన్నో మార్గలు ఉన్నాయి. ఒక్కో మార్గంలో విజ్ఞలను అధిగమించి విజయ సోపానంకు మార్గాన్ని వేసుకోవాలి. కష్టాలు వచ్చాయని ఈజీ మనీ ఎర్నింగ్ అంటే సులువైన మార్గంలో నగదు జమ చేసుకోవాలంటే కటకటాల పాలు కాకతప్పదు. కొందరు యువకులు మాత్రం ఎన్నో అవకాశాలను వీడి... దొడ్డి దారిలో సంపన్నులు కావాలనే వ్యూహరచనలు చేస్తుంటారు. శ్రమించకుండానే.... చుక్క చెమట పట్టకుండానే కోటీశ్వరుడు కావాలనే కలలు కంటుంటారు. అలాంటి ఆలోచనతోనే ఓ యువకుడు అడ్డదారి తొక్కాడు. సులువుగా డబ్బులు సంపాందించే మార్గం ఏదైనా ఉందంటే నేరాలకు పాల్పడటమే అని నిశ్చయించుకున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తి కన్నింగ్ ప్లాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. అతను వేసిన ఆ ప్లాన్ ఏమిటి...?? ఎలా దొరికిపోయాడు..??
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం తెట్టు పంచాయతీ వేపులపల్లికి చెందిన మహేశ్వర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. బీటెక్ వరకు మహేశ్వర్ రెడ్డి.., జల్సాలకు అలవాటుపడ్డాడు. చెడు వ్యసనాలకు బానిసై డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు. అక్రమ మార్గంలో సంపాదించేందుకు ఎన్నిసార్లు ట్రై చేసినా సక్సెస్ కాలేకపోయాడు. కానీ కార్లను అద్దెకు తీసుకుని విక్రయిస్తే బాగుంటుందనే ఆలోచన చేశాడు. అనుకున్నదే అదునుగా మహేశ్వర్ రెడ్డి మదనపల్లెకు చెందిన మౌలా దగ్గర మహేంద్ర లోగో కారు, పీటీఎం మండలానికి చెందిన అనిల్ రెడ్డి వద్ద ఎక్స్‌యూవీ 500 కారు రోజు అద్దెకు తీసుకున్నాడు.
కారును తీసుకొనే ముందు తన ఆధార్ కార్డులు ఇతర వివరాలను తెలిపి వారికి నమ్మకం వచ్చేలా చేశాడు. మూడు నెలలగా కార్లు ఇవ్వకుండా, అద్దె డబ్బు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతూ వచ్చాడు. మరింత డబ్బు అవసరమయ్యే సరికి కార్లు అమ్మేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ వద్ద సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న కార్ల విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కార్లను అద్దెకు తీసుకొని.. విక్రయించి ఆ తర్వాత వాటిని చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్లకు జీపీఎస్ అమర్చి విక్రయించడం, ఆ తర్వాత వారిదగ్గరున్న సెకండ్ కీతో కార్లను చోరీ చేయడం వంటివి చేస్తుండగా పట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.