Andhra Pradesh: అమెరికాలో మంచి జాబ్... 20 రోజుల క్రితం పెళ్లి... అంతలోనే ఊహించి విషాదం

ప్రతీకాత్మక చిత్రం

20 రోజుల క్రితమే వారికి పెళ్లైంది.. పెళ్లివేడుకకు సంబంధించిన జ్ఞాపకాలు కూడా ఇంకా వీడలేదు. కానీ ఇంతలోనే నవదంపతులు విషాదాన్ని మిగిల్చారు.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతనిధి, న్యూస్18

  చూడ ముచ్చటైన జంట.., ఒకరంటే మరొకరికి ఎనలేని ప్రేమ. అమెరికాలోని ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో కొలువు. పెద్దలు నిశ్చయించిన ముహూర్తాన ఘనంగా పెళ్లి జరిపించారు. అందరూ వివాహవేడుకల్లో సంతోషంగా గడిపారు. ఎన్నోఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అడుగుపెట్టిన ఆ జంట ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. పెళ్లిజరిగి పట్టుమని జరిగి నెల కాకముందే ఆ జంటను మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.., అనంతపురంకు చెందిన విష్ణువర్ధన్(28), కడపకు చెందిన కొల్వ కీర్తి(25) అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈడుజోడు కుదరడంతో పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. జూన్ 19వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. ఈనెల 25న తిరిగి అమెరికా వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలని కలలుగన్నారు. కానీ ఇంతలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.

  అమెరికా ప్రయాణ సన్నాహాల్లో ఉన్న నవదంపతులు ఇటీవల బెంగళూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి అనంతపురం తిరుగుప్రయాణమయ్యారు. సరదాగా మాట్లాడుకుంటూ.. పాటలు వింటూ జర్నీ మొదలుపెట్టారు. ఇంతలో ఒక్కసారిగా పెద్దకుదుపు. వీరి కారు రాప్తాడు సమీపంలోకి రాగానే ఎదురుగా బైక్ అడ్డమొచ్చింది. బైక్ ను తప్పించబోయిన కారు డివైడర్ మీదుగా వెళ్లి అవతలివైపు నుంచి వస్తున్న కంటైనర్ ను ఢీ కొట్టింది. దీంతో కారుతో సహా విష్ణువర్ధన్, కీర్తిలు హైవే పక్కన ఉన్న గోతిలో పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఇద్దరూ రక్తపుమడుగులో ఉన్నారు.

  ఇది చదవండి: ఆ జిల్లాలో లాక్ డౌన్ తప్పదా..? చాపకింద నీరులా కరోనా..


  ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానిక పోలీసులు కీర్తిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి, విష్ణు వర్ధన్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయాలు కావడంతో కీర్తి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అరగంట వ్యవధిలోనే విష్ణువర్ధన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. విష్ణు వర్ధన్ తండ్రి సుధాకర్ నాయుడు సహాయ రిజిస్టర్ కాగా, కీర్తి తండ్రి కడపలో పంచాయితీ రాజ్ డీఈగ పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న రాప్తాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది చదవండి: తెలంగాణ మంత్రులకు వైఎస్ జగన్ కౌంటర్.. జలజగడంపై కీలక వ్యాఖలు  మంచి ఉద్యోగాల్లో సెటిలైన నవదంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించేలోపే దుర్మరణం చెందడం అందర్నీ కలచివేస్తోంది. కళ్లముందే కడుపున పుట్టన పిల్లలు మృతి చెందడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అతివేగం, నిబంధనలు పాటించకపోవడం వంటి నిర్లక్ష్యాలతో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ప్రభుత్వాలు రోడ్డు భద్రతపై ఎన్ని అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా... నిర్లక్ష్యంగా వెళ్లడంతో వారితో పాటు ఇతరుల ప్రాణాలమీదకు వస్తోంది.
  Published by:Purna Chandra
  First published: