GT Hemanth Kumar, News18, Tirupati
పండ్లలో వేసవి కాలాని (Summer Season) కి రాజు మామిడి కాయలు(Mangoes) అయితే.. వేసవి పండ్ల యువరాజు మాత్రం పుచ్చకాయలే (Water Melon).. సమ్మర్ సీజన్ మొదలైతే చాలు పుచ్చకాయలు వెల్ కమ్ చెబుతాయి. వేసవి కాలంలో ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పించేందుకు పుచ్చకాయం ఎంతగానో దోహద పడుతుందని వైద్యులు చెబుతుంటారు. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉండటంతో వడదెబ్బ నుంచే కాదు.. వివిధ ఆరోగ్య రుగ్మతలు నుంచి కాపడుతుంది పుచ్చకాయ. అంతేకాదు నేచురల్ వయాగ్రాగా పేరొందింది వాటర్ మెలన్. అందుకే చిన్నా, పెద్ద తేడా లేకుండా వేసవి కాలంలో అధికంగా పుచ్చకాయలను ఆరగిస్తారు. గ్రామాల వద్ద నుండి పట్టణాల వరకూ ఎక్కడ చూసినా పుచ్చకాయల దుకాణాలే కనిపిస్తుంటాయి. అందులోనూ పుచ్చకాయ అంటే ఇష్ట పడనివారుండరు.
నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయలో అధికంగా ఎలక్ట్రోలైట్లు, పొటాషియం వంటివి అధికంగా ఉండడమే కాకుండా, అధిక క్యాలరీలు లేకుండా ఉండే పదార్ధం కావడంతో అందరూ పుచ్చకాయను ఎంజాయ్ చేస్తూ గింజలతో పాటుగా తినేస్తుంటారు. సాధారణంగా పుచ్చకాయలు ఎరుపురంగులో ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు తెలుపుగా ఉండే పుచ్చకాయలు.. పండిన కొద్దీ ఎరుపురంగును సంతరించుకుంటాయి.
ఐతే ఇప్పుడు మార్కెట్లో పసుపు రంగు పుచ్చకాయలు (Yellow Water Melon) సందడి చేస్తున్నాయి. కాలానుగుణంగా ఆధునిక పద్దతుల్లో పంటలను పండిస్తూ రకరకాల పండ్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు రైతులు. ఇలా వచ్చిన పండ్లను తింటూ ఆహార ప్రియులు ఎంజాయ్ చేస్తున్నారు.. తాజాగా పసుపు రంగు పుసుపు రంగు పుచ్చకాయ తిరుపతి నగర వీధుల్లో దర్శనమిస్తోంది. మొదట్లో ఈ పుచ్చకాయ ముక్కను చూసి ఫైన్ ఆపిల్ ముక్కలుగా భావించారు. కానీ ఆ తరువాత పుచ్చకాయ అని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.
చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండటంతో జనం కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో పుచ్చకాయ వ్యాపారస్తులను మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం సాగుతోంది. మనం సాధారణంగా తినే ఎరుపు రంగు పుచ్చకాయ కంటే పసుపు రంగు పుచ్చకాయ రుచి అద్భుతంగా ఉందని అంటున్నారు తిరుపతి వాసులు. తమిళనాడు రాష్ట్రంలో పండించే ఈ పంట ఇటీవల్ల ఆంధ్రలో అడుగు పెట్టిందని ప్రస్తుతం గూడూరుతో పాటు అనంతపురం, కడప జిల్లాల్లోని రైతులు ఈ పంటను సాగుచేస్తున్నారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లోనూ ఎరుపుతో పాటు పసుపు, ఆకుపచ్చ పుచ్చకాయలను కొందరు యువరైతులు పండించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati, Water melon