హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lokesh vs Mithun: ప్లేస్ చెప్తావా..? చెప్పమంటావా..? సినిమా స్టైల్లో లోకేష్ కు మిధున్ రెడ్డి సవాల్..

Lokesh vs Mithun: ప్లేస్ చెప్తావా..? చెప్పమంటావా..? సినిమా స్టైల్లో లోకేష్ కు మిధున్ రెడ్డి సవాల్..

నారా లోకేష్ కు మిధున్ రెడ్డి సవాల్

నారా లోకేష్ కు మిధున్ రెడ్డి సవాల్

Lokesh vs Mithun: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది.. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో మాటల యుద్ధం పీక్ కు చేరింది.. తాజాగా నారా లోకేష్, ఎంపీ మిధున్ రెడ్డి మధ్య మాటలు మంటలుగా మారాయి. లోకేష్ విమర్శలపై ఘాటుగా స్పందించిన మిధున్ ప్లేస్ నువ్వు చెప్పమంటావా.. నన్ను చెప్పమంటావా..? అంటూ సినిమా స్టైల్లో ఛాలెంజ్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

GT Hemanth Kumar, Tirupathi, News18

Lokesh vs Mithun: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా అధికార విపక్షాల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chitoor District) లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాద యాత్ర కొనసాగుతోంది. యువగళం (Yuvagalam) పేరుతో యాత్ర చేపడుతున్న ఆయన.. చిత్తూరుకి వైసీపీ చేసింది ఏమిటి అని నిలదీశారు.. మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిధున్ రెడ్డి (MP Mithun Reddy) అరాచకాల తప్ప.. జిల్లాకు ఏం చేశారు చెప్పాలి అంటూ సవాల్ విసిరారు. లోకేస్ సవాళ్లపై ఎంపీ మిధున్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే చిత్తూరు అభివృద్ధి చర్చకు తంబళ్ళపల్లె రా అని ఎంపీ మిధున్ రెడ్డికి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మదనపల్లె సభలో సవాల్ విసిరితే.. అంతే స్ధాయిలో ప్రతీ సవాల్‌ విసిరారు ఎంపి మిధున్ రెడ్డి.. ఈ నెల 12తేదినా తంబళ్ళపల్లెలోనే ఉంటానమి ప్లేస్ ఎక్కడో చెప్పాలని లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి..

అక్కడితోనే మిధున్ రెడ్డి ఆగలేదు నారా లోకేష్ లో ప్రవహించేది నిజంగా చిత్తూరు జిల్లా రక్తం అయితే.. దమ్మూ ధైర్యం ఉంటే జిల్లాలో ఏ సీటు నుండి అయినా పోటీ చేసి తన మీద గెలవాలన్నారు.. ఇద్దరు నేతల సవాళ్ళు.. ప్రతి సవాళ్ళతో జిల్లా రాజకీయం పూర్తిగా వేడెక్కింది.. ఇటు రెండు పార్టీల కార్తకర్తలు సైతం.. తమ నేతలకు మద్దతుగా ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో పరిస్థితి ఏ క్షణమైనా ఉద్రిక్తతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పట్లో ఈ వేడి చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ మిథున్‌రెడ్డి.. బహిరంగ సవాల్‌ విసిరారు.. ఈనెల 12వ తేదీన తంబళ్లపల్లెలో చర్చకు నేను సిద్ధం.. ప్లేస్ ఎక్కడో చెప్పు అని చాలెంజ్ చేశారు.. చిత్తూరు జిల్లా డీఎన్‌ఏ లోకేష్ రక్తంలో ఉంటే.. తన మీద పోటీ చేయ్ రా.. అంటూ వ్యాఖ్యానించారు.. చర్చకైనా సిద్ధమే.. పోటీకి అయినా సిద్ధమే అంటూ సినిమా స్టైల్లో డైలాగ్ లు పేల్చారు.

ఇదీ చదవండి : ఇక పవన్ బిజీ బిజీ.. 13న గవర్నర్ తో ప్రత్యేక భేటీ.. తరువాత పలు సంఘాలతో వరుస సమావేశాలు

చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమే అన్నారు. లోకేష్ నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు.. ఎవరో రాసి ఇస్తే చదవడం కాదు.. చర్చకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేష్‌.. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. ఎంపీ మిథున్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.. చిత్తూరు జిల్లా గుప్పిట్లో పెట్టుకొని.. దోచుకోవడమే పెద్దిరెడ్డి కుటుంబం పనిగా పెట్టుకుందని ఆరోపించిన ఆయన.. మదనపల్లెకి ఏమి చేశావ్‌ మిథున్‌రెడ్డి అని నిలదీశారు.. దమ్ముంటే రా రేపు తాను తంబళ్లపల్లెలోనే ఉంటాను.. చిత్తూరు జిల్లా అభివృద్ధి పై చర్చకు తాను రెడీ అని ప్రకటించారు.. మీలాగా తనను అరెస్టు చేయొద్దని బెయిల్ తీసుకునే టైపు కాదు అన్నారు. తాము తప్పు చేయము.. అభివృద్ధి మాత్రమే చేస్తాం అన్నారు నారా లోకేష్‌.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chitoor, Nara Lokesh, Peddireddy Ramachandra Reddy