Home /News /andhra-pradesh /

Andhra Pradesh: వీరప్పన్ ఎవరు? లోకేష్ కు కౌంటర్. శస్త్ర చికిత్స తరువాత రోజా తొలి పంచ్ లు

Andhra Pradesh: వీరప్పన్ ఎవరు? లోకేష్ కు కౌంటర్. శస్త్ర చికిత్స తరువాత రోజా తొలి పంచ్ లు

లోకేష్ పై రోజా కౌంటర్లు

లోకేష్ పై రోజా కౌంటర్లు

రాజకీయ వీరప్పన్ ఎవరు..? తిరుపతి ఉప ఎన్నికలో ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరప్పన్ అంటూ లోకేష్ విమర్శుల చేశారు. దీనికి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలైన వీరప్పన్ చంద్రబాబు పక్కనే ఉన్నారంటూ విమర్శించారు.

ఇంకా చదవండి ...
  ఫైర్ బ్రాండ్ రోజా మళ్లీ తనదైన స్టైల్లో పంచ్ లు పేలుస్తున్నారు. అనారోగ్యంతో కొంతకాలం ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇటీవలే చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో రెండు మేజర్ సర్జరీలు జరిగాయి. ప్రస్తుతం ఆమె చెన్నైలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. డాక్టర్ల సలహాతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆమె. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే నియోజవకర్గ సమస్యలపై ఇంటి దగ్గర నుంచే ఫోకస్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభించారు. ఇంటి నుంచి ఆమె అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా నియోజకవర్గంలోని అధికారులు, మున్సిపల్ ఛైర్మన్లు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, రాజీకాయలపై చర్చించినట్టు తెలుస్తోంది.

  తాజాగా రాజకీయ విమర్శలతో మళ్లీ డైలాగ్ వార్ మొదలెట్టారు. తిరుపతి ఉపఎన్నిక జరిగిన తీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రోజా ఘాటుగా స్పందించారు. ఒక్క రూపాయి కూడా పంచకుండా, మద్యం ఇవ్వకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా సీఎం జగన్ కొత్త సంప్రదాయానికి తెర లేపారని కొనియాడారు. కేవలం పాలన, సంక్షేమ పథకాల ద్వారా ఓటర్ల మనసును జగన్ గెలిచారని గుర్తు చేశారు. తమ అధినేతను పొడగడానికే పరిమతం అవ్వని ఆమె.. లోకేష్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

  తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ ఓటమి ఖాయమైంది అన్నారు. అందుకే ఓటమి భయంతోనే దొంగ ఓట్ల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రచారం చేయడం వల్ల తమ ప్రతిష్ట ఏ మాత్రం దిగజారదన్నారు. మిగిలిన చోట్ల లేకుండా కేవలం తిరుపతిలో మాత్రమే ఎందుకు దొంగ ఓట్లు అన్నారని, రోడ్లపై డ్రామాను క్రియేట్ చేశారని ప్రశ్నించారు. జిల్లాకు పెద్ద దిక్కు అయిన పెద్దిరెడ్డిపై కక్షసాధింపుతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓటర్లను పోలింగ్ బూతుల్లో ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డిని వీరప్పన్ అన్న టీడీపీ నేత లోకేష్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రోజా వార్నింగ్ ఇచ్చారు.

  అసలు ఎర్రచందనం వీరప్పన్ అయిన కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పుడు మీ దగ్గర లేడా అంటూ రోజా ప్రశ్నించారు. కిశోరే కుమార్ అనే వీరప్పన్‌ని పెట్టి నువ్వు తిరుపతి ఉప ఎన్నిక చేయలేదా? అని నిలదీశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని రోజా జోస్యం చెప్పారు.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, MLA Roja, Peddireddy Ramachandra Reddy, Rk roja, Roja Selvamani, Tdp, Tirupati, Tirupati Loksabha by-poll, Ycp

  తదుపరి వార్తలు