హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: చెవిరెడ్డి రాజకీయ సన్యాసం..! సీఎం జగన్ విరవిధేయుడు నిర్ణయానికి కారణం అదేనా?

AP Politics: చెవిరెడ్డి రాజకీయ సన్యాసం..! సీఎం జగన్ విరవిధేయుడు నిర్ణయానికి కారణం అదేనా?

చెవిరెడ్డి రాజకీయ సన్యాసం..!

చెవిరెడ్డి రాజకీయ సన్యాసం..!

AP Politics: సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన వీర విధేయుడు.. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరపున నెగ్గితే.. అందులో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు.. నేరుగా సీఎంను కలుసుకొనే యాక్సిస్ ఉన్న నేత.. అలాంటి నేత ఇప్పుడు రాజకీయ సన్యాసం చేస్తున్నారనే ప్రచారం ఉంది. కారణం ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

GT Hemanth Kumar, Tirupathi, News18

AP Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార పార్టీ నేతల్లో కీలక ఎమ్మెల్యే ఆయన.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కి అత్యంత సన్నిహితుడు.. అంతేకాదు వీర విధేయుడు కూడా.. వైసీపీ తరపున గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గితే.. అందులో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు.. ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండా.. నేరుగా అధినేతను కలిసేందుకు యాక్సిస్ ఉన్న నేత ..  చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Baskhar Reddy). అలాంటి చెవెరిడ్డి త్వరలో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారంటే.. ఒకరకంగా అంతా షాక్ గా ఫీలవుతున్నారు. రాజకీయ సన్యాసం అంటే.. ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఆయన ఇక దిగను అంటున్నారంట.. అయితే అందుకు కారణం ఏంటో తెలుసా..? యువతరానికి అవకాశం ఇవ్వడమే అంటున్నారు.. ఆ సంప్రదాయాన్ని చిత్తూరు జిల్లా నుంచే.. అదీ చెవి రెడ్డి భాస్కర్ రెడ్డే ఆ సంప్రదాయానికి శ్రీరకారం చుడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో రాజకీయం యువతవైపు మళ్లుతోంది. అటు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ 40 శాతం సీట్లు యువతకే అంటోంది. అందుకు తగ్గట్టే వైసీపీ కూడా యువతకే పెద్ద పీట వేసే ప్రయత్నాలు ప్రారంభించింది అంటున్నారు. పార్టీలో ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీల వారసులు రాజకీయాల్లో చురుకుగా తమదైన పాత్ర పోషిస్తూన్నారు.. వచ్చే ఎన్నికల్లో మరింత క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.  చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువ నేతలు ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసారు. మునిసిపల్ మండల స్థాయి ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటుపై గురి పెట్టారు.

చిత్తూరు జిల్లా నుంచి నూతనంగా ఏర్పడిన జిల్లా తిరుపతి . ఈ జిల్లాలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైన నేతలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయినా నాటి నుంచి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వేంటే ఉంటూ పార్టీలో కీలకనేతలుగా మారారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఆ ఇద్దరు చెబుతున్నారు.

ఇదీ చదవండి : ముందస్తుకు ముహూర్తం.. సీఎం సంచలన నిర్ణయం..! ఎమ్మెల్యేలతో భేటీ ఎప్పుడంటే?

అందులో ఒకరు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్  రెడ్డి. ఇదే విషయాన్నీ పదే పదే పలు వేదికలపై ప్రజలతో పంచుకున్నారు. దింతో తిరుపతికి వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నాయకుడు ఎవరంటూ ఆరా తీసే పని లేకుండా కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఏకగ్రీవంగా గెలిచినా అభినయ్ రెడ్డి నేడు తిరుపతి డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆ బాధ్యతలతో తిరుపతి నగరంలో పలు అభివృద్ధి పనులను సైతం అన్ని తానై చేస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న భూమన అభినయ్ రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ దాదాపు ఖరారు చేసారంట పార్టీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఇదీ చదవండి: విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తోందని టెన్షన్ పడుతున్నారా..? ఇలా చేయండి సగానికి సగం తగ్గుతుంది.

ఇక చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈసారి  పోటీ చేసేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నుంచి కీలక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైసీసీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటికీ దిగుతున్నట్లు సీఎం జగన్ చెప్పారని విశ్వనీయ సమాచారం. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో ఆయన బదులుగా మోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చే ప్రతిపాదనను ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చినట్లు పార్టీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి జగన్ టికెట్ ఇవ్వరా? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

తిరుపతి రురల్  ఎంపీపీగా గెలుపొందిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోను మోహిత్ రెడ్డినే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే సగం నియోజకవర్గంలో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ సత్వర పరిష్కరించడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు అయితే వారసులు అసెంబ్లీలో అడుగు పెట్టె అవకాశం మెండుగా ఉందంటున్నారు విశ్లేషకులు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Chevireddy bhaskar reddy, Chittoor

ఉత్తమ కథలు