హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Volunteers Dance: సచివాలయంలో వాలంటీర్ల చిందులు... మన్మథరాజా అంటూ స్టెప్పులు.. వీడియో వైరల్..

Volunteers Dance: సచివాలయంలో వాలంటీర్ల చిందులు... మన్మథరాజా అంటూ స్టెప్పులు.. వీడియో వైరల్..

వార్డు సచివాలయంలో వాలంటీర్ల డాన్సులు

వార్డు సచివాలయంలో వాలంటీర్ల డాన్సులు

ప్రభుత్వ కార్యాలయాల్లో (Government Office) పనిచేస్తున్నవారు బాధ్యతతో వ్యవహరించాలి. వివిధ పనుల కోసం ప్రజలు వచ్చివెళ్తుండే చోట ఇతర వ్యవహారాలు చేపట్టకూడదు.

  ప్రభుత్వ కార్యాలయాల్లో (Government Office) పనిచేస్తున్నవారు బాధ్యతతో వ్యవహరించాలి. వివిధ పనుల కోసం ప్రజలు వచ్చివెళ్తుండే చోట ఇతర వ్యవహారాలు చేపట్టకూడదు. అలా చేస్తే కచ్చితంగా విమర్శలపాలవడం లేదా ఉద్యోగాన్ని కోల్పోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల్లో పార్టీలంటూ హల్ చల్ చేస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ వార్డు సచివాలయంలో వాలంటీర్లు చేసిన నిర్వాకం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లా (Chittoor District) కేంద్రంలోని కట్టమంచి వార్డు సచివాలయంలో సిబ్బంది చేసుకున్న వేడుకలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారాయి. సోమవారం సచివాలయాన్ని సిబ్బంది, వాలంటీర్లు డాన్స్ ఫ్లోర్ గా మార్చేశారు. విధులు నిర్వహించకుండా సినిమా పాటలకు డాన్సులేశారు. మన్మధ రాజా... మన్మధ రాజా అంటూ వాలంటీర్లు  స్టెప్పులేశారు.


  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నేరుగా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో గ్రామసచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. తరచూ ఇలాంటి ఘటనలు ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేస్తున్నాయి. గతంలో బర్త్ డే వేడుకలు, ఇతర సంబరాలంటూ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు గీతదాటిన సందర్భాలున్నాయి.

  ఇది చదవండి: యువతకు సీఎం జగన్ గుడ్ న్యూస్... కాలేజీల్లో ఇకపై జాబ్ గ్యారెంటీ కోర్సులు


  గతంలో కర్నూలు జిల్లాలో ఇదే తరగాలో ఓ ఘటన జరిగింది. నంద్యాల మండలం పొన్నాపురం గ్రామ సచివాలయంలో ఓ మహిళా ఉద్యోగి బర్త్ డే వేడుకలను సిబ్బంది సచివాలయ భవనంలోనే నిర్వహించారు. సచివాలయం 1, 2 ఆఫీసుల సిబ్బంది వేడుకలు చేసుకున్నారు. సినిమా పాటలు పాడుతూ డ్యాన్సులు చేశారు. ఐతే సచివాలయంలో పనిచేస్తూ నిబంధనలు ఉల్లంఘించడం, కరోనా మార్గదర్శకాలు పాటించకుండా గుంపులుగా డ్యాన్సులు చేశారు.. మళ్లీ ఏదో ఘనకార్యం చేసినట్లు ఈ సీన్ మొత్తాన్ని మొబైల్‌లో రికార్డ్ చేశారు. వాలంటీర్ల పార్టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పార్టీలో పాల్గొన్న 11 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అందరికీ ఉచిత దర్శనం..


  ఇక ఇదే నెల మొదటి వారంలో చిత్తూరు జిల్లాలోనే దాదాపు 70 మందికిపైగా వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేయడం కలకలం రేపింది. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తున్నారని పాకాల మండలంలోని వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లను వేధిస్తున్న ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార నేతలు వేధింపులు మానుకోవాలన్నారు.

  ఇది చదవండి: కళ్ల ముందే నేషనల్ హైవే... కానీ వారు రోడ్డెక్కలేరు.. కారణం ఇదే..!


  గ్రామ పంచాయతీకి ఈవోగా కుసుమకుమారి ఉన్నంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు. మొత్తం 76 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్లపై స్థానిక రాజకీయ నేతలు పెత్తనాలు మానుకోవాలని.. అలాగే వారిని కట్టడి చేయాలని డిమాండ్ చేయాలంటూ తహసీల్దార్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ward Volunteers

  ఉత్తమ కథలు