హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Wonder Kid: చేతులతో అద్భుతాలు చేస్తున్న చిన్నారి.. రికార్డులు మోత మోగిస్తున్న చిచ్చరపిడుగు

Wonder Kid: చేతులతో అద్భుతాలు చేస్తున్న చిన్నారి.. రికార్డులు మోత మోగిస్తున్న చిచ్చరపిడుగు

చిన్న వయసులోనే అద్భుతాలు చేస్తున్న సువర్ణిక

చిన్న వయసులోనే అద్భుతాలు చేస్తున్న సువర్ణిక

Wonder Kid: వండర్ కిడ్ అన్న పదం కూడా ఈ చిన్నారికి ముందు చిన్నదిగానే ఉంటుంది ఏమో.. ఆరేళ్ల వయసులోనే ఎన్నో అద్భుతాలు చేస్తోంది.. రికార్డులను తన సొంతం చేసుకుంటోంది.. ఇంతకీ ఆమె టాలెంట్ ఏంటో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

GT Hemanth Kumar, Tirupathi, News18

Wonder Kid: సమాజంలో మల్టీ టాలెంట్ (Multi Talent) కలిగిన పిల్లలని మనం చాల అరుదుగా చూస్తుంటాం.  అలాగే ఆరేళ్ల వయసుకే రెండు మూడు భాషలపై పూర్తి పట్టు వచ్చిన వారు చాలా అరుదుగా ఉంటారు. మాట్లాడడం వచ్చినా.. ఆ వయసులో ఒక భాషను వాడుక విధానంలో రాయాలన్న.. చదవాలన్న చాల కష్టంగా ఫీల్ అవుతుంటారు. అదే అంబులెన్స్ (Ambulance) కు రాసిన విధంగా మిర్రర్ ఎఫెక్ట్ (Mirror Effect) తో ప్రతి అక్షరాన్ని రాయగలమా అంటే కష్టమే అని చెప్పాలి.  ఎడమ చేతి నుంచి కుడి చేతి వైపు అయితే చిన్నారులు సింపుల్ గా రాసేస్తాం.. అక్షరాలను ముగింపు నుంచి మొదటి వరకు రాయమంటే దిక్కులు చూడక తప్పదు. దీనినే అపసవ్య దిశాలో రాయడం అని కూడా అంటారు. ఇలాంటి అరుదైన ప్రజ్ఞాశాలిగా.. ఎన్నో జాతీయ.. ఆంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంటోంది నెల్లూరుకు చెందిన ఆరేళ్ళ చిన్నారి.

నెల్లూరు జిల్లా కావాలి పట్టణంలో వస్త్ర వ్యాపారం చేస్తుంటారు శ్రీనివాస రావు. ఈయనకు మొదటి సంతానం పచ్చిపులుసు సువర్ణిక. ఇప్పుడుడిప్పుడే అక్షరాలు దిద్దుకొని పాఠ్యంశాలు అర్థం చేసుకొనే ఆరేళ్ళ వయసు ఈ చిన్నారిది..   కానీ మేధాశక్తి మాత్రం ఆకాశమంత అని చెప్పాలి.

ఏదైనా వింటే ఆ పాఠ్యంశాన్ని ఎప్పుడు అడిగిన వెంటనే చెప్పే ఏకసంతాగ్రహి  చిన్నారి సువర్ణిక.. అయితే కరోనా సమయంలో స్కూళ్లకు సెలవు కావడంతో తన బుర్రకు పదునుపెట్ట సాగింది. అందరి చిన్నారులలా కాకుండా.. ప్రత్యేక ప్రతిభ కనపరిచేలా కృషి చేసింది. సవ్యదశ కాకుండా అపసవ్య దిశలో అక్షరాలను. లెక్కలను రాయటం ప్రారంభించింది.

ఇదీ చదవండి : ఫ్లెక్సీలు.. ప్లాస్టిక్ కవర్లు.. పొగాకు ఉత్పత్తుల నిషేధం సాధ్యమేనా? ప్రభుత్వ లక్ష్యం ఏంటి?

తెలియని తనం కాబోలు అంటూ తల్లితండ్రులు లైట్ తీసుకున్నారు. ఒక బాషా నుంచి మరో బాషా... అలానే గణిత శాస్త్రనీ సైతం అపసవ్య దిశలో వ్రాయడం చేస్తూ వచ్చేది. కరోనా తరువాత పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అయినా సాధన వీడలేదు... అలుపెరగకుండా సాధన చేస్తూ వచ్చింది సువర్ణిక. ఇలా పాఠశాలలో సైతం ఉపాధ్యాయులు పొందించే సమయంలో అపసవ్య దిశలోనే రాస్తూ వచ్చేది.

ఇదీ చదవండి: ఆహ్లాదంతో పాటు.. ఆధ్యాత్మిక పెంచేలా పార్క్.. సరికొత్త హంగులతో ఆహ్వానం ఎక్కడంటే?

కొన్నాళ్ల తరువాత ఉపాధ్యాయులు సువర్ణిక రాసే విధానాన్ని తప్పుబట్టారు. ఇలా రాయకూడదని.. ఇది పిచ్చి రాతలు అని ఇలా రాస్తే దండన తప్పదని హెచ్చరించారు. అయినా సువర్ణిక మాట వినలేదు. తాను రాసె అపసవ్య దిశలో వేగంగా రాయడం ప్రారంభించింది. అంబులెన్స్ కు వేసే స్టికర్ లా ఆమె రాతలు అద్దంలో అర్థమయ్యేలా రాయడంలో  సిద్ద హస్తురాలిగా మారింది.

ఇదీ చదవండి: సూడాన్ టు చిత్తూరు .. మత్తులోకలంలో యువత.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

ఇంగ్లీష్, హిందీ, తెలుగు బాషలలో అక్షరాలను అపసవ్య దిశలోనే కాకుండా... అంబులెన్స్ మోడల్లో రాస్తుంది. సాధారణ లిపిని కూడా వెనుక నుంచి వేగంగా లిఖిస్తుంది. 20 ఎక్కాల వరకు వెనుక నుంచి రాస్తూ అసలు శైలి వచ్చేలా వేగంగా చిత్రిస్తుంది. పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలను ఈ చిన్నారి అత్యంత వేగంగా పూర్తి చేస్తుంది. రీజనింగ్లోనూ సత్తా చాటుతుంది. ఆంగ్ల అక్షరమాలలో ఏ అంటే 1, జెడ్ అంటే 26 చివరిది. ఈమధ్యలో ఉండే అక్షరావళిలో దేనికైనా సంఖ్య టక్కున చెబుతుంది.

ఇదీ చదవండి: అలీ మనసు మారిందా..? పవన్ ను అంత మాట అనడానికి ఆ పదవే కారణమా..?

తెలుగు, హిందీ భాషల్లో కూడా ప్రతిభ చాటుతోంది. విభిన్నమైన ప్రతిభ కలిగిన సువర్ణికకు మూడు సార్లు జాతీయ, మరో రెండు సార్లు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు నిర్వహించిన పోటీల్లో నిమిషంలో ఎనిమిది గుణింతాలు చెప్పింది. అపసవ్య దిశలో పదాలు రాసి గతంలోనే ఈపుస్తకంలో పేరు నమోదు చేసుకుంది. ఇండియా బుక్ రికార్డ్సు, ఇండియా స్టార్ బుక్ రికార్సులో తన పేరు లిఖించుకుంది. రోమన్ సంఖ్యలతో పది వరకు గుణింతాలను అపసవ్యంగా 50 సెకన్ల వ్యవధిలో రాస్తుండడంతో జాతీయ బుక్ ఆఫ్ రికార్డును దక్కించుకుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Celbratie kids, Nellore Dist

ఉత్తమ కథలు