Wife and Husband Relation: భర్తపై వీళ్లకు ఎంతప్రేమో చూడండి..! వాళ్ల ప్రేమకు చిహ్నం ఇదే..!

అనంతపురం జిల్లాలో భర్త సమాధి పక్కనే సమాధులు కట్టించుకున్న భార్యలు

40 ఏళ్ల క్రితం కొండయ్య ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ముగ్గురు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఐతే గత ఏడాది కొండయ్య మృతి చెందడంతో ఇద్దరి జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. ఐతే భర్తపై ప్రేమను చంపుకోలేక వారు తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

 • Share this:
  GT Hemanth Kumar, Tirupati, News18

  ప్రపంచంలో చాలా వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఒక్కో మనిషి ఒక్కోలా ఆలోచిస్తూ.. తన ఊహాశక్తికి అనుగుణంగా తమ భావాలను వ్యక్త పరుస్తుంటారు. వారు చేసే పనులు చాల మందికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కోట్ల ఆస్థి ఉన్నా వారికి పిల్లలు లేరు. ఇద్దరు భార్యలే తన జీవితం, తన భర్తే తమ సర్వస్వం అంటూ బ్రతుకుతున్నారు ఆ భార్యలు. ఇద్దరు భార్యలు ఉన్న ఏనాడు ఇద్దరి మధ్య ఘర్షణలేకుండా ప్రశాంతమైన జీవితం గడిపారు. గతేది అనారోగ్య కారణాల దృష్ట్యా భర్త మరణించాడు. సరిగ్గా ఏడాది అనంతరం భర్త సమాధి వద్ద పెద్ద ఘాట్ కట్టించారు. అందులో ఎలాంటి వింత లేకపోయినా ర్త సమాధి పక్కనే ఇద్దరు సతీమణులు సమాధి కట్టుకున్న ఉదంతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లాలో (Anantapuram District) చోటు చేసుకుంది. భర్తపై ఎనలేని ప్రేమను చూపిస్తూ.., చనిపోయిన తమ భర్త పక్కనే ఉండాలన్న వారి ప్రేమను అందరూ అభినందిస్తున్నారు.

  వివరాల్లోకి వెళితే... అనంతపురం మండలంలోని కామారుపల్లి గ్రామంలో కురుబ రాగే పెద్ద కొండయ్య నివసించే వాడు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు కొండయ్య. 40 ఏళ్ళ కొన్నేళ్ల క్రితం కొండయ్య రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య అంజినమ్మ కాగా రెండవ భార్య యల్లమ్మతో కలసి స్వగ్రామంలో నివాసం ఉండేవారు. పెళ్ళైన నాటి నుంచి వీరికి సంతాన ప్రాప్తి మాత్రం కలగలేదు. దీంతో ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమగా ఉండేవారు. ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు.

  ఇది చదవండి: కుక్కల కోసం రూ.2కోట్లతో పార్క్.. జనం ఏమంటున్నారంటే..!


  అప్పట్లో పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తి, చరాస్థులతో పాటు కొండయ్య బాగానే సంపాదించాడు. 60 ఎకరాల మేర భూమి తన పేరుమీద ఉండగా.. మరికొంత ఇళ్లస్ధలం., సొంత ఇల్లు ఉండేది. పొలంను అమ్మేసి వచ్చిన సొమ్మును గుడికి, అనాధ శరణాలయాలకు విరాళం ఇచ్చేశాడు. మిగిలిన కొంత ఆస్థి., సొమ్మును తాను, తన భార్యలు ఇద్దరు బ్రతికేందుకు ఉంచుకున్నాడు.

  ఇది చదవండి: వయసు ఎనిమిదేళ్లు... లక్ష్యం ఎవరెస్ట్.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఐఏఎస్ తనయుడు..


  అనుకోకుండా గత ఏడాది సెప్టెంబర్ 18వ తేదీ అనారోగ్య కారణాల వల్ల కొండయ్య మృతి చెందారు. దీంతో తమకు ఉన్న సొంత స్థలంలోనే కొండయ్య మృత దేహాన్ని ఖననం చేసిన భార్యలు అంజినమ్మ, యల్లమ్మలు తమ భర్త ప్రధమ వర్ధంతి నాటికి అదే ప్రదేశంలో సమాధి ఏర్పాటు చేసి పెద్ద ఘాట్ ను నిర్మించారు. అంతేకాదు తాము బ్రతిలి ఉండగానే ఇద్దరు తమ సమాధులు భర్త సమాధి పక్కనే కట్టించుకున్నారు.

  తాము చనిపోయాక తమ భర్త పక్కనే కలనం చేయాలని తోటి బంధువులతోనూ సన్నిహితులతోని నిత్యం చెప్తూ వచ్చేవారట అంజనమ్మ, యల్లమ్మలు. సరిగా కొండయ్య చనిపోయిన ఏడాది అనంతరం భర్తకు నిర్మించిన సమాధి పక్కనే తమకు సమాధులు ఏర్పాటు చేసుకొని తన మృత దేహాలను ఇక్కడే ఖననం చేయాలనీ అందరికి చెప్పడం విశేషం. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విని చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకు వ్యాపించడంతో వారందరూ ఆ సమాధి వద్దకు బ్రతికి ఉన్న వారి సమాధిని వింతగా చూస్తున్నారట.
  Published by:Purna Chandra
  First published: