TIRUPATI WOMAN POLICE SUSPECT DEATH IN ANANTAPURAM DISTRICT SENSATIONAL FACTS FOUND IN SUICIDE NOTE FULL DETAILS HERE PRN TPT
Woman Police Suicide: ‘నన్ను రేప్ చేసి చంపేస్తారు..’ మహిళా పోలీస్ సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు..
ప్రతీకాత్మక చిత్రం
ఆమె ఒక మహిళా పోలీస్.. అందరికీ ధైర్యం చెప్పే ఉద్యోగం చేస్తోంది. కానీ తానే ధైర్యం కోల్పోవాల్సిన స్థితికి తీసుకొచ్చారు కొందరు కీచకులు. వేధింపులు భరించలేక కన్నవారికి కడుపుకోత మిగుల్చుతూ కఠిన నిర్ణయం తీసుకుంది.
మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రతి గ్రామా సచివాలయంలో మహిళా పోలీసులను ఏర్పాటు చేసింది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను రూపుమాపేందుకు గ్రామ, వార్డు సచివాలయల్లో పోలీసింగ్ వ్యవస్థ సహాయ పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అలాంటి గ్రామా సచివాలయంలో పోలీస్ గా విధులు నిర్వహించే మహిళకే రక్షణ కరువైంది. మరో స్త్రీకి దైర్యం చెప్పాల్సిన స్థానంలో ఉన్న విమెన్ పోలీసుకే లైంగిక వేధింపులు తప్పలేదు. లైంగిక వేధింపులు తాళలేక... మనసులో కుమిలి పోతు మనస్థైర్యాని వీడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ లో సంచలన విషయాలున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా (Anantapuram) చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి గ్రామ సచివాలయం-1లో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తోంది సావిత్రి. నిత్యం సచివాలయం పరిధిలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా... విధులకు హాజరవుతూ వచ్చేది. అకస్మాత్తుగా రెండు రోజులపాటు ఇంటికి రాకుండా... కుటుంబ సభ్యులకు తనెక్కడ ఉన్నానో తెలుపక పోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు.... సావిత్రి సొంత గ్రామం అయిన లేపాక్షి పెద్ద చెరువు సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా మృతదేహాన్ని గుర్తించారు.
తొలుత అనారోగ్య కారణాలవల్ల సావిత్రి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి పోలీసులకు తెలిపారు. దీంతో సావిత్రి వ్యక్తిగత కారణాలవళ్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేసుకున్నారు వైద్యులు. అక్క సావిత్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చింది చెల్లి రమాదేవి. మృతి చెందిన సావిత్రి హ్యాండ్ బ్యాగులో సూసైడ్ నోట్ లభ్యమైంది. దీతో రమాదేవి వెంటనే పోలీసులను ఆశ్రయించి సావిత్రి రాసిన లేఖను పోలీసులకు అప్పగించింది.
ఆ లేఖలో 'తాను పనిచేస్తున్న సచివాలయంలో ఓ ఉద్యోగి నుంచి లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. తప్పించుకొని వెళ్లినా వేధించేందుకే ప్రయత్నం చేసేవాడు. తప్పుకోవాలన్న వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోలేను. తన వేధింపులకు ఆత్మహత్యే శరణ్యం' అంటూ లేఖలో పేర్కొంది. అంతేకాదు తనను రేప్ చేసి చంపేయాలని చూస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. తమ సోదరి మృతికి కారకులైన వారిని శిక్షించాలంటూ ఆమె వేడుకొంది. దీనిపై ఎస్సై మునీర్ అహ్మద్న వివరణ కోరగా మృతురాలి బంధువులు ఇచ్చిన లేఖను పరిశీలించామని, అది మృతురాలే రాసిందో లేదోనని నిర్ధారించిన తర్వాత కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.