Cheating: మెత్తగా మాటలు చెప్పింది.. రూ.45కోట్లు దోచేసింది.. అది ఎలాగంటే..!

ప్రతీకాత్మకచిత్రం

పేద మధ్య తరగతి ప్రజలకు పొదుపు చేసుకునేంత సంపాదన ఉండదు. వచ్చిన దాంట్లో ఖర్చులకు పోగా ఎంతోకొంత వెనకేసుకోవాలని భావిస్తుంటారు. అలాంటి వారిని ఓ మహిళ..

  • Share this:
    GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

    పేద మధ్య తరగతి ప్రజలకు పొదుపు చేసుకునేంత సంపాదన ఉండదు. వచ్చిన దాంట్లో ఖర్చులకు పోగా ఎంతోకొంత వెనకేసుకోవాలని భావిస్తుంటారు. అందుకోసం తాముండే ప్రాంతంలో చిన్నమొత్తాల్లో చిట్టీలు వేస్తుంటారు. కొందరు వేలల్లో చిట్టీలు కడితే.. మరికొందరు కాస్త ధైర్యం చేసి లక్షల్లో వేస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు పైసాపైసా కూడబెట్టి నెలనెలా చిట్టీలు కడుతుంటారు. అలాంటి వారి బలహీనతలను క్యాష్ చేసుకునేందుకు చీటర్స్ బయలుదేరుతుంటారు. పేదవారి నమ్మకమే పెట్టుబడిగా పెట్టి డబ్బుతో ఉడాయిస్తుంటారు. అలా చీట్టీల పేరుతో వందలాది మందిని నమ్మించిన ఓ మహిళ ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ.45 కోట్లతో ఉడాయించింది. 20 ఏళ్లుగా జనం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చూస్తూ రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా హిందూపురంలోని సత్యనారాయణ పేటకు విజయలక్ష్మి, ఆమె తనయుడు అశోక్ వైపీఏ గ్రూప్ ఫండ్స్ పేరుతో చిట్టీల వ్యాపారం మొదలు పెట్టారు.

    దాదాపు 20 ఏళ్లుగా వారు చిట్టీలు వేస్తుండటంతో పట్టణంలో చాలా మందికి నమ్మకం కుదిరింది. చిట్టీల పేరుతో వసూలు చేసి సొమ్మును అప్పుడప్పుడు సొంతానికి వాడుకొని కొంతకాలం తర్వాత తిరిగి ఇచ్చేసేది. ఐతే ఇటీవల జనం చిట్టీల డబ్బులు సరిగా ఇవ్వకపోవడంతో కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఆమె కుటుంబంతో సహా పరారైంది. ఇటీవల బాధితులు ఆమె ఇంటి వద్దకు వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో బంధువుల ఇంటికి వెళ్లినట్లు భావించారు. ఐతే వారం రోజులైనా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి వారి మొబైల్ కు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో తామంతా మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విజయలక్ష్మి, అశోక్ లు దాదాపు 1600 మందికి రూ.45 కోట్ల మేర టోకరా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

    బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయలక్ష్మి, అశోక్ కోసం గాలిస్తున్నారు. వారి ఇంటి దగ్గర నిఘా ఉంచారు. అలాగే వారి బంధువుల ఇళ్లులో ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు మొబైల్ నెంబర్ల లొకేషన్ల ఆధారంగానూ దర్యాప్తు చేస్తున్నురు. ఇదిలా ఉంటే పిల్లల పైసాపైసా కూడబెట్టి చిట్టీలు కడితే దారుణంగా మోసం చేసిందంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు.
    Published by:Purna Chandra
    First published: