Home /News /andhra-pradesh /

TIRUPATI WOMAN BRUTALLY ATTACKED AND KILLED AFTER SHE HAVING EXTRAMARITAL AFFAIR IN KADAPA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Affair: భర్తను వదిలేసి ప్రియుడే లోకమనుకుంది.. కానీ అంతలోనే ఊహించని పరిణామం..

మున్నీషా (ఫైల్)

మున్నీషా (ఫైల్)

Kadapa Woman: మనస్పర్థలతో భర్తకు దూరంగా ఉంటున్న ఓమహిళ.. జీవనోపాధి కోసం ఓచోట ఉద్యోగంలో చేరి యజమానికి దగ్గరైంది. ఈ వ్యవహారం అతడి ఇంట్లో చిచ్చు రేగడంతో మహిళ ప్రాణం కోల్పోవలసి వచ్చింది.

    GT Hemanth Kumar, News18, Tirupati

    ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు ఒక ఫ్యాషన్ గా మారిపోయిందానడంలో సందేహం లేదు. పెళ్లై చక్కగా సంసారం చేసుకోకుండా క్షణిక సుఖాలకు అలవాటు పడుతున్నవారు జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో కొన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. మరికొన్ని ఘటనల్లో ప్రాణాలమీదకు తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది. అక్రమ సంబంధాలు ఏదో సమయంలో నేరాలకు దారితీస్తున్నాయి. వీటితో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారే కాకుండా వారితో ఉండేవారు కూడా వివాదాల్ల చిక్కుకుంటున్నారు. మనస్పర్థలతో భర్తకు దూరంగా ఉంటున్న ఓమహిళ.. జీవనోపాధి కోసం ఓచోట ఉద్యోగంలో చేరి యజమానికి దగ్గరైంది. ఈ వ్యవహారం అతడి ఇంట్లో చిచ్చు రేగడంతో మహిళ ప్రాణం కోల్పోవలసి వచ్చింది.

    వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) గిద్దలూరుకు చెందిన షేక్ మున్నీషాకు కలసపాడు మండలం రామాపురంకు చెందిన మదార్ వల్లితో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు పుట్టి చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి వీరికి సంతానం కలుగలేదు. దీంతో భార్యభర్తలు విడిపోయారు. ఈ క్రమంలో కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణానికి చెందిన ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్లో ఆరు నెలల క్రితం పనిలో చేరింది. అదే సమయంలో చికెన్ కొట్టు నడుపుతున్న మహబూబ్ హుస్సేన్ తో పరిచయం ఏర్పడింది.

    ఇది చదవండి: కాకినాడలో మిస్సింగ్.. విజయవాడలో ప్రత్యక్షం.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యువతి..


    ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. పోరుమావిళ్లలోనే ప్రియుడు మహబూబ్ హుస్సేన్ తో కాపురం పెట్టింది. తరచూ శారీరకంగా కలుస్తుండటంతో మున్నీషా గర్భవతి అయిందని తేలింది. దీంతో ఆమె తమ కుటుంబంలో చిచ్చుపెట్టిందని కోపంతో ఊగిపోయిన మహబూబ్ హుస్సేన్ బంధు వర్గం ఆమెపై మూకుమ్మడి దాడికి యత్నించారు.

    ఇది చదవండి: ఈ దుర్మార్గులకు గరుడ పురాణంలో శిక్షలే కరెక్ట్..! పసికందుతో వ్యాపారమా..?


    ఈనెల 28న రాత్రి గిద్దలూరులో ఉన్న మున్నీషాని సూపర్ మార్కెట్ ఓనర్ ఆదాం, బి.కోడూరు పోలీస్ కానిస్టేబుల్ జిలాని, కలసపాడు పోలీస్ కానీస్టేబుల్ సయ్యద్, గురుప్రసాద్ మరికొందరు కారులో పొరుమామిల్లకు తీసుకెళ్లారు. వీరితో పాటు మరి కొంతమంది ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో ఆ దెబ్బలు భరించలేద ఆమె అపస్మారక స్థితికి చేరింది. బంధువుల ఆమెను ఆస్పత్రిలో చేర్చగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు సూపర్ మార్కెట్ ఓనర్, ఓ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగితో పాటు మరో పది మందిపై కేసు నమోదు చేశారు. మొత్తం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Kadapa, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు