TIRUPATI WOMAN BOOKED FOR TRYING TO CHEAT A FAMILY ON THE NAME OF SUPERSTITIONS IN TIRUPATI CITY OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Shocking: పూజలో బంగారం పెడితే డబుల్ అవుతుందని అత్యాశకు పోయారు.., అంతా అయ్యాక బాక్స్ ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్..
తిరుపతిలో క్షుద్రపూజల పేరుతో మోసం..
Tirupati News: దుష్టశక్తులు, అదృష్టం వరించే పూజలంటూ కొందరు అమాయకులు నిలువునా మునుగుతున్నారు. ఇలాంటి వాళ్లున్నంతకాలం క్షుద్రపూజలతో జనాన్ని దోచేవారికి ఎలాంటి ఢోకా ఉండదు. అలా మీ ఇంట్లో దుష్టశక్తి ఉందని ఓ కుటుంబాన్ని నమ్మించి ఓ మాయలేడి.. ఇంద్రా సినిమాలో మాదిరిగా బంగారం డబుల్ అవుతుందంటూ నమ్మించి ముంచేసింది.
అంతరిక్షంలో పరిశోధనలు చేస్తున్న రోజులు ఇవి. ప్రపంచం మొత్తం టెక్నాలజీపై ఆధారపడి నడుస్తోంది. కానీ అలాంటి రోజుల్లోనూ మంత్రాలకు చింతకాయలు రాలతాయనే సామెతను నమ్ముతున్నారు కొంతమంది అమాయకులు. దుష్టశక్తులు, అదృష్టం వరించే పూజలంటూ కొందరు అమాయకులు నిలువునా మునుగుతున్నారు. ఇలాంటి వాళ్లున్నంతకాలం క్షుద్రపూజలతో జనాన్ని దోచేవారికి ఎలాంటి ఢోకా ఉండదు. అలా మీ ఇంట్లో దుష్టశక్తి ఉందని ఓ కుటుంబాన్ని నమ్మించి ఓ మాయలేడి.. ఇంద్రా సినిమాలో మాదిరిగా బంగారం డబుల్ అవుతుందంటూ నమ్మించి ముంచేసింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) కొర్లగుంట అబ్బన్న కాలనీలో నివాసం ఉంటున్నాడు ప్రసాద్. టీటీడీలో కాంట్రాక్టు కొలువు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉన్నాడు.
అబ్బన్న కాలనీలో గత మూడు రోజులుగా ఇద్దరు మహిళలు గోల్డ్ కవరింగ్ నగలు అమ్ముతూ.. ఎవరికైనా కష్ఠాలు ఉంటే మంత్రాలతో మాయచేసి జీవితాన్ని పూలబాటలా మారుస్తానంటూ అందర్నీ నమ్మిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈనెల 4న ఓ మహిళా మహిళల శివప్రసాద్ కుటుంబాన్ని తన మాయ మాటలతో బుట్టలో వేసుకుంది. ఇంట్లో ప్రత్యేల పూజలు చేయాలని చెప్పింది. ఏవేవో పూజలు చేసింది. ఇల్లంతా తిరుగుతూ నోటికొచ్చి మంత్రాలు చదువుతూ, అరుస్తూ హడావిడి చేసింది.
ఈ క్రమంలో ఇంట్లోని బంగారు నగలు, వెండి ఆభరణాలు, ఐదు వేల రూపాయల నగదును తాను చేసే పూజలో ఉంచాలని చెప్పింది. అలా చేస్తే సంపద పెరగుతుందని చెప్పింది. దీంతో మంత్రగత్తె చెప్పిన విధంగానే ఇంట్లోని నగదు, నగలను ఓ బాక్స్ లో ఉంచి పూజలో ఉంచారు శివప్రసాద్ కుటుంబ సభ్యులు. శివ ప్రసాద్ కుటుంబ సభ్యులను నమ్మించేందుకు కాసేపు పూజచేసి వారిని మైకంలో ఉంచిన మహిళ.. ఆ నగల బాక్సును ఎర్రడి గుడ్డల్లో చుట్టి తనతో పాటు తెచ్చుకున్న బాక్సును అక్కడుంచింది.
ఆ తర్వాత పూజ పూర్తయిందని కుటుంబ సభ్యులందరూ ఆలయానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ చేసి వస్తే తమ కష్టాలంతా తొలగిపోతాయని నమ్మబలికింది. దీంతో ఆ మహిళ చెప్పిన మాటతో ఆలయానికి వెళ్లిన శివప్రసాద్ కుటుంబ సభ్యులు కొబ్బరి కాయ కొట్టి ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గర మంత్రగత్త లేకపోవడంతో అనుమానం వచ్చిన శివప్రసాద్ పూజలో ఉంచిన బాక్స్ తెరిచే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికి ఆ బాక్సులు తెరుచుకోక పోవడంతో పగలగొట్టి బాక్సులను చూస్తే బియ్యం ఒక్క రూపాయి బిళ్ళను ఉంది. దీంతో షాక్ కు గురైన శివప్రసాద్ కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమెను గాలించి పట్టుకున్నారు. తమ నగలు తీసుకున్న తర్వాత ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.